టాలీవుడ్ బాలీవుడ్ తరాలకు తెలంగాణా పోలీసులు పెద్ద షాకిచ్చారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరాగోల్డ్ కేసు వ్యవహారాన్ని పోలీసులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో హీరాగోల్డ్ కి ప్రచారం చేసిన సెలబ్రిటీలపై దృష్టి సారించారు.

నౌహీరా, క్యూనెట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన బాలీవుడ్ స్టార్లను పోలీసులు గుర్తించారు. క్యూనెట్ కేసులో ఏడుగురు సినిమా తారలకు నోటీసులు పంపించారు. అల్లు శిరీష్, బొమన్ ఇరాని, వివేక్ ఒబెరాయ్, అనీల్ కపూర్, జాకీష్రాఫ్, పూజాహెగ్డే, షారుఖ్ ఖాన్ వంటి తారలకు నోటీసులు జారీ చేశారు.

సైబరాబాద్ పోలీసుల నోటీసులకు బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ సమాధానమిచ్చారు. రిప్లై ఇవ్వని ఆరుగురు సెలబ్రిటీలకు మరోసారి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు పోలీసులు.

నౌహీరా కేసులో 12 మంది సెలబ్రిటీలను గుర్తించిన పోలీసులు.. నౌహీరాతో కాంట్రాక్టు లేదా రెమ్యునరేషన్ తీసుకున్నారో లేదో తేలాకే.. సదరు సెలబ్రిటీలకు నోటీసులు పంపనున్నారు.