హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త పీవీపీ ఆయన కుటుంబసభ్యులు హాజరయ్యారు. 2018లో పీవీపీ ఉద్యోగి తిమ్మారెడ్డి కిడ్నాప్‌కు గురయ్యాడు.

ఇందుకు సంబంధించి పీవీపీతో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదైంది. ఈ కేసులో పీవీపీతో పాటు కుటుంబసభ్యులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

కాగా ఈ కేసులో ఈ నెల 18 వరకు ఆయన్ను అరెస్ట్ చేయడం లాంటి చర్యలేవీ చేపట్టవద్దని హైకోర్టు గత గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే. తనపై కేసును కొట్టివేయాలని, సీఆర్‌పీసీ సెక్షన్ 41 ఎ కింద నోటీసును ఇచ్చిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పీవీపీ హైకోర్టును కోరారు.