ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి పివి సింధు బయోపిక్ రాబోతుందని కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి తెర దించుతూ ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ పివి సింధు బయోపిక్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. 

ఇటీవల జరిగిన  ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ లో పివి సింధు స్వర్ణ పతకం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇండియాకి తొలి స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా పివి సింధు చరిత్ర సృష్టించింది. అందుకే అందుకే ఆమె బయోపిక్ తీయాలనుకుంటున్నాడు సోనూసూద్.

అయితే పివి సింధు పాత్రలో ఎవరు కనిపించబోతున్నారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో పరినితీ చోప్రా, సమంత లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే దర్శకనిర్మాతలు ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. అయితే ఈ విషయంపై తన బయోపిక్‌లో ఎవరు నటిస్తే బాగుంటుందని పివి సింధుని ప్రశ్నించగా.. దానికి ఆమె దీపికా పదుకోన్ పేరు చెప్పింది. 

దీపిక కూడా ఒకప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ అని.. అలవాటు ఉన్న గేమ్ కాబట్టి తన పాత్రలో దీపిక అయితే బాగుంటుందని చెప్పింది సింధు. మరి ఈ విషయంలో మేకర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక పివి సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్ర కూడా సినిమాకు చాలా కీలకం. ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించనున్నారని సమాచారం.