ఇండియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధు కమల్ హాసన్ తో భేటీ అయ్యారు.  ఇటీవల ప్రముఖ రాజకీయ నాయకులను అలాగే పలువురు ప్రముఖ వ్యక్తులను కలుసుకుంటున్న సింధు నేడు కమల్ హాసన్ ని కలుసుకొని మీడియా ముందుకు వచ్చారు. పివి సింధు రాక గురించి ముందే తెలుసుకున్న కమల్ ఆమెను పార్టీ కార్యాలయానికి ఆహ్వానించారు.

చెన్నై లోని మక్కల్ నీది మయం కార్యాలయంకి వచ్చిన సింధును పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రత్యేకంగా కలుసుకొని పలు విషయాలపై ముచ్చటించారు. అనంతరం మీడియా ముందుకు వచ్చి గోల్డ్ మెడల్ గెలిచిన సందర్బంగా కమల్ హాసన్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. అందుకు సంబందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం కమల్ హాసన్  ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఒకవైపు సినిమాలు చేస్తూనే పార్టీని బలోపేతం చేస్తున్నారు, ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో కమల్ భేటీ అవుతున్నారు, ఇక ఇప్పుడు పివి.సింధు ని ప్రత్యేకంగా కలుసుకోవడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.