అల్లు అర్జున్(Allu Arjun) - సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప(Pushpa) మూవీ. ఇక పుష్ప పార్ట్ 2 కోసం సూపర్ ఫాస్ట్ గా సన్నాహాలు జరుగుతున్నాయి.

అల్లు అర్జున్(Allu Arjun) - సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప(Pushpa) మూవీ. ఇక పుప్పా పార్ట్ 2 కోసం సూపర్ ఫాస్ట్ గా సన్నాహాలు జరుగుతున్నాయి.

దాదాపు 5 భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన పుష్ప(Pushpa) మూవీ సంచలన విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, బాలీవుడ్ లోను 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక వీటితో పాటు తమిళ, మలయాళ , కన్నడ భాషల్లోను అద్భఉతమైన విజయాన్ని.. వసూళ్లను రాబట్టింది పుష్ప(Pushpa)  సినిమా.

మైత్రీ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే పుష్ప2 పెద్దగా లొకేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు..  అవే లొకేషన్స్ లో సెకండ్ పార్టును కూడా షూట్ చేసుకోవచ్చు అనుకున్నారంతా.. కాని పుష్పా పార్ట్2 కోసం డైరెక్టర్  సుకుమార్ కొత్త లొకేషన్స్ కోసం సెర్చ్ చేస్తున్నాడట.

బాలీవుడ్ లో పుష్ప సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు అక్కడ 100 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈసారి సౌత్ తో పాటు  ఉత్తరాది లొకేషన్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నారట. అంతేకాదు, ఒక బాలీవుడ్ స్టార్ హీరోను కూడా పుష్పా సెకండ్ సినిమా కోసం రంగంలోకి దింపబోతున్నట్టు సమాచారం. దీంతో  బాలీవుడ్ ప్రేక్షకులు మరింత ఓన్ చేసుకునే అవకాశాలు ఎక్కువని భావిస్తున్నారు.

అంతే కాదు పుష్పలో స్మగ్లర్ గా ఎదుగుతూ కనిపించిన హీరో పుష్పరాజ్(Allu Arjun) .. సెకండ్ పార్టు సినిమాలో స్మగ్లర్స్ కి నాయకుడిగా మారి.. అందరినీ శాసించే స్థాయిలో కనిపిస్తాడట. ఇక ఫస్ట్ పార్ట్ లో లవర్ గా అలరించిన రష్మిక సెకడ్ పార్ట్ లో బన్నీ భార్య పాత్రలో కనిపించనుంది. అందుకు తగినట్టుగానే పాటలు . ఫైట్లు ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నారట.

పుష్ప సినిమాతో మొదటి సారి పాన్ ఇండియాకు వెళ్ళిన బన్నీ(Allu Arjun) కి పుష్ప సక్సెస్ తో మర్చిపోలేని  బహుమతి లభించింది. అటు అన్ని భాషల్లో ఇప్పుడు బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దాంతో పుష్ప2 (Pushpa)  ని కూడా లేట్ చేయకుండా పరుగులు పెట్టించాలి అని చూస్తున్నాడు అల్లు అర్జున్(Allu Arjun). ఇప్పటికే కథ, నటీనటులు రెడీగా ఉన్నారు. సెకండ్ పార్ట్ కొసం కొంచెం షూటింగ్ కూడా చేసి ఉంచుకున్నారట టీమ్.

దాంతో ఈ మూవీ షూటింగ్ ఫాస్ట్ గానే కంప్లీట్ అంవుతుంది అని నమ్ముతున్నారు. ఇక వచ్చే నెల నుంచి పుష్ప2 సినిమా షూటింగును మొదలుపెట్టాలని అనుకుంటున్నారు వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి 4 నుంచి 6 నెలల్లో షూటింగు పార్టు పూర్తిచేయాలని బన్నీ(Allu Arjun)  సీరియస్ గా చెప్పాడట.

అంతే కాదు గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి రిపిట్ కాకుండ చూసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందామని అనుకున్నట్టు సమాచారం. ఈసారి పుష్ప(Pushpa)  పార్ట్ 1 కంటే గట్టిగా టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారట టీమ్. ఇక  సాధ్యమైనంత వరకూ ఈ సినిమాను దసరా బరిలో దింపాలనే అభిప్రాయాన్నిఅల్లు అర్జున్(Allu Arjun)  వ్యక్తం చేశాడని తెలుస్తోంది.
 

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈమూవీ మ్యూజిక్ సెన్సేషనల్ హిట్ అయింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా పాటలను ఇమిటేట్ చేస్తూ..ఎన్నో వీడియోల చేశారు ఫ్యాన్స్. కామన్ పీపుల్  దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ బన్నీని ఇమిటేట్ చేశారు. బన్నీ(Allu Arjun) రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపించిన ఈ సినిమలో మలయాళ స్టార్ ఫహద్ ఫజిల్ తో పాటు, సునిల్ , అనసూయ, అజయ్ ఘోష్, అజయ్, శత్రు లాంటి ప్రముఖులు నటించారు.