ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అందులో భాగంగానే ప్రస్తుతం అల్లు అర్జున్‌, విలన్‌ పాత్రలో నటిస్తున్న ఫాహద్‌ ఫాజిల్‌ మధ్య చిత్రీకరణ జరుగుతుంది. వీరిద్దరి మధ్య పలు యాక్షన్‌ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నట్టు చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. 

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న చిత్రం `పుష్ప`. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతుంది. రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అందులో భాగంగానే ప్రస్తుతం అల్లు అర్జున్‌, విలన్‌ పాత్రలో నటిస్తున్న ఫాహద్‌ ఫాజిల్‌ మధ్య చిత్రీకరణ జరుగుతుంది. వీరిద్దరి మధ్య పలు యాక్షన్‌ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నట్టు చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. 

Scroll to load tweet…

ఇందులో పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌, భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్రలో ఫాహద్‌ నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే ఈ ఫైట్‌ సీన్‌ అదిరిపోయేలా ఉంటుందని, సినిమాకే హైలైట్గా నిలుస్తుందని సమాచారం. ఇక ఈ చిత్ర మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న పాన్‌ ఇండియా లేవెల్‌లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని సమాచారం. 

`పుష్ప` సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్లు, టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచాయి. మరోవైపు `దాక్కో దాక్కో మేక` పాట మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇటీవల రష్మిక మందన్నా పాత్ర లుక్‌ సైతం ఆద్యంతం ఆకట్టుకుంది.