Pushpa Shock: `పుష్ప` ట్రైలర్‌ వాయిదా.. అభిమానులకు బన్నీ టీమ్‌ క్షమాపణలు..

మార్నింగ్‌ నుంచే సోషల్‌ మీడియాలో `పుష్ప ట్రైలర్‌ డే` అనే యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు అభిమానులు. ట్రైలర్‌ కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. కానీ ఇంతలో పెద్ద షాకిచ్చింది `పుష్ప` టీమ్‌.

pushpa trailer post poned due to technical says sorry to fans

అల్లు అర్జున్‌(Allu Arjun) నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ `పుష్ప`(Pushpa). సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్ర ట్రైలర్‌ని ఈ రోజు(సోమవారం) సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. దీంతో మార్నింగ్‌ నుంచే సోషల్‌ మీడియాలో `పుష్ప ట్రైలర్‌ డే`(Pushpa Trailer) అనే యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు అభిమానులు. ట్రైలర్‌ కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. సరిగ్గా ఆరు గంటల మూడు నిమిషాలైంది. ట్రైలర్ ఇంకా రాలేదు. అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. వెయింటింగ్‌ మరింతగా పెరిగింది. అయినా ట్రైలర్‌ రాలేదు, కానీ ట్విట్టర్‌లో `పుష్ప` నిర్మాతలు ఓ ట్వీట్‌ చేశారు. 

Allu Arjun అభిమానులకు షాకిచ్చారు. ట్రైలర్‌ని విడుదల చేయడం లేదని తెలిపారు. కొన్ని కారణాల వల్ల ట్రైలర్‌ విడుదల వాయిదా పడిందని తెలిపింది. `కొన్ని ఊహించని సాంకేతిక కారణాల వల్ల మేం `పుష్ప ట్రైలర్‌ని ఈ రోజు సాయంత్రం 6.03గంటలకు విడుదల చేయలేకపోతున్నాం. డిలేకి క్షమాపణలు తెలియజేస్తున్నాం. దీని కోసం వేచి ఉండండి` అని తెలిపింది. అయితే ఈ ట్రైలర్‌ని ఎప్పుడు విడుదల చేయబోతున్నారనే విసయంలో క్లారిటీ ఇవ్వలేదు. కాస్త ఆలస్యమైనా ఈ రోజు విడుదలవుతుందా? లేక మరో రోజుకి వాయిదా వేస్తారా? అన్నది సస్పెన్స్ లో పెట్టారు. దీంతో అభిమానులు మరింతగా వెయిట్‌ చేస్తున్నారు. విడుదల విషయంలో క్లారిటీ కోసం వేచి చూస్తున్నారు. 

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న `పుష్ప` చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. `పుష్పః ది రైజ్‌` అనే మొదటి భాగం సినిమా ఈ నెల(డిసెంబర్) 17న విడుదల కానుంది. `ఆర్య`, `ఆర్య2` చిత్రాల తర్వాత అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడో చిత్రమిది. ఇందులో అనసూయ, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ హీరో ఫహద్‌ ఫాజిల్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బన్నీ.. పుష్పరాజ్‌ అనే పాత్రని పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇందులో సమంత స్పెషల్‌ సాంగ్‌ని చేస్తుండటం విశేషం. ఇది సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 

also read: Pushpa:‘పుష్ప’నైజాం రైట్స్ దిల్ రాజుకే...ఎంతకంటే

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios