Asianet News TeluguAsianet News Telugu

బన్నీ - సుకుమార్ టైటిల్ ఇదా.. నమ్మొచ్చా?

సినిమా ప్రారంభం నాటి నుంచీ ఈ సినిమాకు సింహాచలం, శేషాచలం అనే టైటిల్స్ వినపడ్డాయి. అయితే అవన్నీ కాదని సినిమా టీమ్ అఫీషియల్ కొట్టిపారేస్తూ ప్రకటన కూడా చేసింది. ఈలోగా టైటిల్ ని హీరోయిన్ పేరుతో ఉండబోతోందని, రెండు అక్షరాల టైటిల్ అని వార్త వచ్చింది. 

Pushpa Title for Allu Arjun, Sukumar movie
Author
Hyderabad, First Published Apr 7, 2020, 9:04 AM IST

గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రానికి సంభందించిన టైటిల్ వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కరోనా దెబ్బతో షూటింగ్ వాయిదా పడిన ఈ సినిమాపై వార్తలు మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. వాస్తవానికి అల్లు అర్జున్ పుట్టిన రోజుకు ఓ చిన్న టీజర్ ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో అవన్నీ కష్టమని ఫస్ట్ లుక్ వదులుతున్నారు. ఆ ఫస్ట్ లుక్ లో సినిమా టైటిల్ సైతం ఉండబోతోంది. ఆ టైటిల్ గురించే ఈ వార్త.

సినిమా ప్రారంభం నాటి నుంచీ ఈ సినిమాకు సింహాచలం, శేషాచలం అనే టైటిల్స్ వినపడ్డాయి. అయితే అవన్నీ కాదని సినిమా టీమ్ అఫీషియల్ కొట్టిపారేస్తూ ప్రకటన కూడా చేసింది. ఈలోగా టైటిల్ ని హీరోయిన్ పేరుతో ఉండబోతోందని, రెండు అక్షరాల టైటిల్ అని వార్త వచ్చింది. అంతేకాదు ఆ టైటిల్ పుష్ప అని మీడియాలో బలంగా వినిపిస్తోంది. అయితే ఇలాంటి టైటిల్ అల్లు అర్జున్ సినిమాకు పెడతారా అనే సందేహం మీడియాలో చాలా మందికు ఉంది. 

పుష్ప అనే టైటిల్ కనక పెడితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా వెంకటేష్ సినిమాలకు ఇలాంటి టైటిల్స్ పెడుతూంటారు.  అయితే టైటిల్ తోనే ఏదో మ్యాజిక్ చెయ్యాలనే తపన సుకుమార్ ది. అందుకే ఆయన టైటిల్స్ విభిన్నంగా ఉంటాయి. రామ్ చరణ్ తో రంగస్దలం టైటిల్ కూడా అలాంటి చిత్రమైన మ్యాజిక్ చేసిందే. కాబట్టి ఇదే టైటిల్ ఫైనల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

‘ఆర్య’(2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు తెలిపింది. బుధవారం ఉదయం 9 గంటలకు అప్‌డేట్‌ను రివీల్‌ను చేయనున్నట్టు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios