Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ “పుష్ప” ట్రైలర్ కి టైమ్ ఫిక్స్

ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే పాటలు ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి.

 

Pushpa The Rise trailer in the first week of December
Author
Hyderabad, First Published Nov 24, 2021, 8:34 AM IST

 అల్లు అర్జున్,  రష్మిక మందన్న, మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ కాంబినేషన్ లో సుకుమార్ రూపొందిన మాగ్నమ్ ఓపస్ “పుష్ప : ది రైజ్” రిలీజ్  దగ్గర పడుతోంది. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో “పుష్ప” ట్రైలర్ కోసం అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం “పుష్ప: రైజ్ ట్రైలర్” కట్‌లు ప్రోగ్రెస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

అందుతున్న సమాచారం మేరకు  ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను భారీగా టీమ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ ట్రైలర్ ను డిసెంబర్ 2 వ తేదీన విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘పుష్ప’ ట్రైలర్ విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. పాన్ ఇండియా మూవీ గా ఈ చిత్రం తెరకెక్కుతుండటం తో బాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్, లిరికల్ సాంగ్స్, పోస్టర్స్, గెటప్స్ ఇలా ఒక్కటి అని కాకుండా ప్రతిదీ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ సైతం టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొడుతుందనటంలో సందేహం లేదు. 

Also read Pushpa: 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' సాంగ్ వచ్చేసింది.. తన సైన్యంతో అల్లు అర్జున్ చిందులు

ఇక కొద్ది  రోజుల క్రితం నిర్మాతలు అల్లు అర్జున్ డైలాగ్‌లు చెప్పడానికి డబ్బింగ్ స్టూడియోకి వెళుతున్న వీడియోను పంచుకున్నారు. అల్లు అర్జున్ ‘పుష్ప’రాజ్ అనే కూలీ  నుంచి స్మగ్లర్ గా ఎదిగిన పాత్రలో నటిస్తున్నాడు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ భరద్వాజ్ కూడా నటిస్తున్నారు. పాన్ ఇండియన్ ఫిల్మ్ “పుష్ప: ది రైజ్”లో సమంత  ఈ చిత్రంలో ఒక ప్రత్యేక సాంగ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప సందడి మాములుగా ఉండటం లేదు. 

Also read సల్మాన్, అక్షయ్, రజినీ... అందరూ ప్రభాస్ వెనుకే... వంద కోట్లు కాదు, ఆయన ప్రెజెంట్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే!
 

Follow Us:
Download App:
  • android
  • ios