Asianet News TeluguAsianet News Telugu

ఫిల్మ్ ఫేర్ 2022 అవార్డ్స్ లో ‘పుష్ప’ క్లీన్ స్వీప్.. అల్లు అర్జున్ థ్యాంక్యూ నోట్.!

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లోనూ మూవీ సెన్సేషన్ గా మారింది. ఇంతటి విజయాన్ని అందించినందుకుగాను బన్నీ ఆడియెన్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
 

Pushpa Movie clean sweep in Filmfair 2022 Awards, Thank you note to Allu Arjun!
Author
First Published Oct 10, 2022, 12:56 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)- క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్ లో వచ్చిన  ‘పుష్ప’ చిత్రం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. చిత్రంలోని పాత్రలు, పాటలు, డైలాగ్స్, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా నిలిచాయి. చిత్ర యూనిట్ ఊహించనదాని కంటే రెట్టింపు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. గతేడాది డిసెంబర్ లో ‘ఫుష్ఫ : ది రైజ్’ (Pushpa The Rise) థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అదే సమయంలో భారీ చిత్రాలు విడుదలైనప్పటికీ ‘పుష్ప’ మాత్రం జోరును తగ్గించలేదు. ఊరమాస్ లుక్ లో అల్లు అర్జున్ ఇచ్చిన పెర్ఫామెన్స్ అదరగొట్టింది. ‘పుష్పరాజ్’ చూపిన నటవిశ్వరూపానికి ప్రపంచ వ్యాప్తంగా రెస్పాన్స్ ను అందుకొని.. ఐకానిక్ మూవీగా నిలిచిపోయింది. 

మరోవైపు ఫిల్మ్ ఫేర్ సౌత్ 2022 అవార్డులోనూ సత్తా చూపించింది. అక్టోబర్ 9న బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ అవార్డుల ప్రధానోత్సవంలో తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ చిత్ర పరిశ్రమలలో అత్యుత్తమ చిత్రాలకు సంబంధించిన అవార్డులను ప్రధానం  చేశారు. ఈ సందర్భంగా 67వ ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ 2022లో తెలుగు నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప : ది రైజ్’ చిత్రం అన్ని విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఫిలిమ్ ఫేర్ అవార్డ్స్ లో క్లీన్ స్వీప్ చేసి  మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాలీవుడ్ నుంచి ‘ఫుష్ఫ’నే ఆ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ‘పుష్ఫ’లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు,  తెలుగు ఉత్తమ దర్శకుడిగా - సుకుమార్ కు, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ , నేపథ్య గాయకుడిగా సిద్ శ్రీరామ్, ఉత్తమ నేపథ్య గాయనిగా ఇంద్రావతి చౌహాన్, ఉత్తమ సినిమాటోగ్రఫీగా మిరోస్లా కుబా బ్రోజెక్ అవార్డులను అందుకున్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన సినిమాను ప్రేక్షకులు, అభిమానులు ఇంతలా  ఆదరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా థ్యాంక్స్ నోట్ ను పోస్ట్ చేశారు. అవార్డుల ప్రధానోత్సవంలో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్, కృతి శెట్టి, సానియా అయ్యప్పన్, ఐంద్రితా రేలు కొన్ని ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌లు ప్రదర్శించారు. మరోవైపు ‘పుష్ఫ : ది రూల్’ (Pushpa The Rule) కూడా చిత్రీకరణ కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే పూజా కార్యక్రమాన్ని పూర్తి చేయగా.. ఈ నెల చివర్లో సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. రెండో భాగాన్ని దర్శకుడు సుకుమార్ మరింత గ్రాండ్ గా తెరకెక్కించబోతున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios