యూట్యూబ్ లో అల్లు అర్జున్ చిత్రాలు పెద్ద హిట్. అక్కడ అతనికు మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో వారంతా ఈ సినిమా కోసం వెయిట్ చేయటం కలిసొచ్చిందంటున్నారు. 

తెలుగు స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలపై దృష్టి సారించారు. ఆ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ కూడా పాన్ ఇండియా స్దాయిలో విడుదలైంది. అక్కడ ప్రమోషన్స్ కూడా సరిగ్గా జరగలేదు. దాంతో ఈ సినిమా అక్కడ ఏ స్దాయిలో వర్కవుట్ అవుతుందనే లెక్కలు,అంచనాలు ట్రేడ్ లో వేస్తున్నారు. ఇంతకీ ఏంటి నార్త్ ఇండియాలో పుష్ప పరిస్దితి..వాళ్ళకు నచ్చాడా?

అందుతున్న సమాచారం మేరకు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మొదటి రోజు మొరుగైన మంచి వసూళ్లు రాబట్టింది. తొలిరోజు ఈ సినిమా హిందీ వెర్షన్ దాదాపు రూ.3 కోట్ల కలెక్ట్ చేసిందని సమాచారం. అయితే అసలు పుష్ప చిత్ర యూనిట్ హిందీ వెర్షన్ కు ప్రచారం పై దృష్టి పెట్టకపోవటమే సమస్య అయ్యిందంటున్నారు.. అయినప్పటికీ అక్కడ పుష్ప అనూహ్యంగా మంచి వసూళ్లను రాబట్టడం ఆశ్చర్యం వేస్తోంది అంటున్నారు. అయితే యూట్యూబ్ లో అల్లు అర్జున్ చిత్రాలు పెద్ద హిట్. అక్కడ అతనికు మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో వారంతా ఈ సినిమా కోసం వెయిట్ చేయటం కలిసొచ్చిందంటున్నారు.

https://twitter.com/taran_adarsh/status/1472451329746354180

రెండో రోజుకు నాలుగు కోట్లు వసూలు చేసిందని, కలెక్షన్స్ పెరిగాయని బాలీవుడ్ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేసారు. మొత్తం నిన్న,మొన్న కలిపి ఏడు కోట్లు కలెక్ట్ చేసిందని అన్నారు. మూడో రోజు అయిన ఈ రోజు కూడా సాలిడ్ గా కలెక్షన్స్ ఉన్నాయని,డ్రాప్ లేదని తేల్చాడు. 

అలాగే స్పైడర్ మ్యాన్, నో వే హోమ్ సినిమా పోటీ తట్టుకుని మరీ తొలి రోజు మూడు కోట్లు రాబట్టడం హిందీ వెర్షన్‌కి మంచి ఫీట్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. ఇప్పటికీ మహారాష్ట్రలో 50 శాతం థియేటర్లకు మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ ‘పుష్ప’ రూ7 కోట్లకు పైగా వసూలు చేయడం గొప్ప విషయమే అని తేలుస్తున్నారు. అయితే హిందీలో ఎక్కువగా ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలే వచ్చాయి. అయితే బన్ని ఫెరఫార్మెన్స్ ను మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. అల్లు అర్జున్ నటనను మెచ్చుకుంటూ నార్త్ ఇండియాకు చెందిన జనం సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూండటం గమనార్హం.