స్టార్ హీరోయిన్ రష్మిక మందాన(Rashmika mandanna) కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పూజలు చేయించిన స్వామిజీ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ కాగా.. ఈ సంఘటన విశేషత సంతరించుకుంది. ప్రస్తుతం సదరు వీడియో వైరల్ గా మారింది.
టాప్ హీరోయిన్ గా రష్మిక మందాన దూసుకుపోతున్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఆమె చేతి నిండా ఆఫర్స్ తో ఫుల్ బిజీ కెరీర్ గడుపుతున్నారు. వరుస హిట్స్ దక్కడంతో ఆమె క్రేజ్, ఇమేజ్ పెరుగుతూ పోతుంది. ఆమె రీసెంట్ రిలీజ్ పుష్ప (Pushpa)రికార్డ్ వసూళ్లు రాబడుతుంది. తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా పుష్ప చెప్పుకోదగ్గ కలెక్షన్స్ దక్కించుకుంటుంది. రష్మిక కెరీర్ లో మరొక బ్లాక్ బస్టర్ గా పుష్ప నిలవనుంది.
పుష్ప సీక్వెల్ గా పుష్ప ది రూల్ తెరకెక్కుతుంది. ఆ చిత్రంలో కూడా రష్మికనే హీరోయిన్. అయితే ఈ సక్సెస్ కి కారణం ఆమె హార్డ్ వర్క్, గ్లామర్, టాలెంట్ అని చెప్పాలి. అదే సమయంలో పూజలు, పునస్కారాలు, దేవుళ్ళు అని కూడా ఆమె విశ్వాసం. పరిశ్రమ జనాలకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. అలాగే పూజలు, తాయత్తుల మహిమలు, జాతకాలు బాగా నమ్ముతారు. ఈ జాబితాలో రష్మిక కూడా ఉన్నారు.
ఆమె పూజలు చేస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆమె చేత పూజలు నిర్వహిస్తుంది వేణు స్వామి కావడంతో ఆ వీడియో సంచలనంగా మారింది. వేణు స్వామి గతంలో కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేయడం ద్వారా ఫేమస్ అయ్యారు. నాగ చైతన్య-సమంత విడాకులు గురించి ఆయన ముందే చెప్పారు. అలాగే ఇటీవల రకుల్ తన ప్రియుడు జక్కీ భగ్నానీ గురించి రివీల్ చేశారు.
Also read Pushpa story: పుష్ప కథ కాపీనా.. ఆ వెబ్ సిరీస్ గురించే డిస్కషన్ ?
వెంటనే రకుల్-జక్కీ జాతకాలు చూసిన ఆయన.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు తప్పవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతక రీత్యా జక్కీని రకుల్ వివాహం చేసుకుంటే ఆమెకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి, జైలుపాలు కూడా కావచ్చని తెలిపారు. అలాగే చంద్రబాబు మరలా ఓడిపోతారని, సీఎం జగన్ మరో 15 ఏళ్ళు పాలిస్తాడని చెప్పడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ 2024 నాటికి పాలిటిక్స్ లో ఉండరని, ఆయన జాతకమే అంతని తెలిపారు. వేణు స్వామితో రష్మీ పూజలు చేస్తున్న వీడియో ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది .

