`పుష్ప2` వైజాగ్ షెడ్యూల్ పూర్తి.. అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్.. వైరల్
`పుష్ప 2` షూటింగ్ గత కొన్ని రోజులుగా వైజాగ్‌లో జరుగుతున్న విసయం తెలిసిందే. తాజాగా ఆ షెడ్యూల్ పూర్తయ్యింది. అల్లు అర్జున్ పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.

అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `పుష్ప2`. ఇది `పుష్ప`కి రెండో పార్ట్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ వంటి తారాగణం నటిస్తుంది. వీటితోపాటు కొత్త నటీనటులు యాడ్ కాబోతున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయ్యింది. ఆ విషయాన్ని బన్నీ వెల్లడించారు. ఈ మేరకు ఆయన వైజాగ్ బీచ్‌లో దిగిన ఫోటోని పంచుకున్నారు. బరువైన హృదయంతో ఈ పోస్ట్ పెట్టినట్టుగా ఉంది. వైజాగ్ బీచ్‌లో ఎదురుగా అలలు ఎగిరి పడుతూ ఒడ్డుకు వస్తుండగా, వాటిని చూస్తూ, వాటికి ఎదురెళ్లుతున్నట్టుగా బన్నీ ఉన్నారు. సముద్రానికి సంబంధించి ఆ బ్యూటీని, ఆ ఫీలింగ్‌ని ఏకాంతంగా ఆస్వాధిస్తున్నారు బన్నీ. ఈ సందర్భంగా ఆయన ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
`థ్యాంక్యూ వైజాగ్` అంటూ పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో బన్నీ ఈ పోస్ట్ షేర్ చేశారు. విశాఖపట్నం తనకు ఎప్పుడూ చాలా స్పెషల్ అని పేర్కొంటూ లవ్ సింబల్ పంచుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోటో, ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బన్నీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. నేటితో వైజాగ్ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తుంది. ఇందులో పోర్ట్ ప్రధానంగా పలు కీలక సన్నివేశాలు, అలాగ ఇంట్రడక్షన్ సాంగ్‌ని భారీ స్థాయిలో చిత్రీకరించారట. నెక్ట్స్ టీమ్ హైదరాబాద్‌కి షిఫ్ట్ కాబోతుందని, ఇక్కడ ఓ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు సమాచారం. వైజాగ్ నుంచి బన్నీ హైదరాబాద్ కి చేరుకున్నారు. సినిమా ఫస్ట్ లుక్ బన్నీ బర్త్ డేకి ఉండే అవకాశం ఉంది.