అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప2` మూవీ నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌ వచ్చింది. ఈ మూవీ టీజర్‌  రాబోతుందట. బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలు లోడింగ్‌ అని చెప్పొచ్చు.   

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప 2` చిత్రంలో నటిస్తున్నారు. మూడేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కి ఇది కొనసాగింపుగా వస్తుంది. తొలి భాగం పెద్ద హిట్‌ కావడంతో రెండో పార్ట్ పై ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తి మూడేళ్లుగా కంటిన్యూ అవడం మామూలు విషయం కాదు. అలా ఇంట్రెస్ట్ ని ఎంగేజ్‌ చేయడంలో దర్శకుడు సుకుమార్‌, బన్నీ సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు. 

మూడేళ్లుగా `పుష్ప 2` నుంచి వచ్చిన అప్‌ డేట్ ఓ గ్లింప్స్, రెండు కొత్త పోస్టర్లు. రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ. ఇక ఇన్నాళ్లు వీటితోనే ఊరించిన టీమ్‌ ఇప్పుడు ఆడియెన్స్ కి ట్రీట్‌ ఇచ్చేందుకు రాబోతుందని, `పుష్ప 2` జాతర షురూ చేయబోతుంది. అల్లు అర్జున్‌ బర్త్ డేని పురస్కరించుకుని ఈ హంగామాకి తెరలేపుతుంది. రేపు అదిరిపోయే అప్‌డేట్‌ ఇవ్వబోతుంది యూనిట్‌. 

`పుష్ప 2` నుంచి మాస్‌ జాతర ప్రారంభం కాబోతుందని ఈ మేరకు టీమ్‌ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది. అయితే రేపు(మంగళవారం) `పుష్ప2` టీజర్‌ అప్‌ డేట్‌ ఇవ్వబోతుందట. ఏ రోజు టీజర్‌ని విడుదల చేయబోతున్నారో రేపు చెప్పబోతున్నారు. ఏప్రిల్‌ 8న బన్నీ బర్త్ డే ఉంది. ఈ సందర్భంగా టీజర్‌ని విడుదల చేసే అవకాశం ఉంది. 

ఇక `పుష్ప2` మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. అయితే చిత్రీకరణ చివరి దశకు చేరుకుందట. ఇందులో ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు. జాతర ఎపిసోడ్‌ గూస్‌బంమ్స్ తెప్పిస్తుందట. దీన్ని భారీగా ప్లాన్‌ చేశాడట దర్శకుడు సుకుమార్‌. ఇక బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. సునీల్‌, అనసూయ, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Scroll to load tweet…

ఈ సందర్భంగా మరో విషయాన్ని స్పష్టం చేసింది యూనిట్‌. రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది. ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం కానుకగానే `పుష్ప 2`ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. వాయిదా పడుతుందనే వార్తలకు చెక్‌ పెట్టేశారు.