Asianet News TeluguAsianet News Telugu

Pushpa 2 : బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్.. ‘పుష్ప2’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. కానీ.!

ఐకాస్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2’ నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. తాజాగా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Pushpa 2 Release Date announced Officially by Makers NSK
Author
First Published Sep 11, 2023, 4:53 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప2 : ది రూల్’. 2021లో వచ్చిన ‘పుష్ప’కు ఇది సీక్వెల్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైతీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ స్కేల్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాదలోనే శరవేగంగా జరుగుతోంది. అయితే Pushpa2 The Rule నుంచి అభిమానులు, సాధారణ ఆడియెన్స్ ను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్ వచ్చింది. 

తాజాగా మేకర్స్ ‘పుష్ప2’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ ఏడాది చివర్లో వస్తుందని అంతా భావించారు. కనీసం వచ్చే ఏడాది సమ్మర్ లోపైనా థియేటర్లలో చూద్దామనుకున్నారు ‘పుష్ప’ ఫ్యాన్స్. కానీ మేకర్స్ ఇంకాస్తా ఆలస్యంగానే రానుంది. 2024 ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పుష్పరాజ్ థియేటర్లలో దిగనున్నారు. రిలీజ్ డేట్ వచ్చిన ఆనందంలో బన్నీ ఫ్యాన్ ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచి చిత్ర విడుదలకు ఇంకా ఏడాది పాటు వెయిట్ చేయాలని పలువురు అంటున్నారు. 

కానీ.. ఈ చిత్రానికి సూపర్ డేట్ ఫిక్స్ చేశారు. ఆగస్టు 15న గురువారం ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఆ రోజు సెలవు. ఆ మర్నాడు శుక్రవారం, శనివారం, ఆదివారం వీకెండ్ కావడం విశేషం. దీంతో ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి ‘పుష్ప2’ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపడం ఖాయమంటున్నారు. అన్నీ పక్కాగా ప్లాన్ చేసే రిలీజ్ విషయంలో ఆగస్టు వరకు వెళ్లినట్టు తెలుస్తోంది.   

ఏదేమైనా, పుష్ప : ది రైజ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు ‘పుష్ప2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు దక్కడంతో మరింతగా హైప్ క్రియేట్ అయ్యింది. ఆ స్థాయిలోనే సుకుమార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. అనసూయ, సునీల్, ఫాహద్ ఫాజిల్, తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios