మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీని 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీని 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. దీనితో ఈ చిత్రం మెమొరబుల్ గా నిలిచిపోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన లీకులతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. RC 15 విషయంలో కూడా శంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. రాంచరణ్ వివిధ గెటప్స్ లో అదరగొట్టేస్తున్నారు అని టాక్. 

అయితే కమల్ హాసన్ ఇండియన్ 2 మూవీ కోసం శంకర్.. రాంచరణ్ చిత్రానికి కొంత గ్యాప్ ఇచ్చాడు. తాజాగా ఈ చిత్రానికి మరో చిక్కు వచ్చి పడ్డట్లు తెలుస్తోంది. రాంచరణ్ మూవీ కోసం భారీ సెట్ నిర్మించాల్సి ఉందట. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా రామకృష్ణ పనిచేస్తున్నారు. పుష్ప 2 చిత్రానికి కూడా ఆయనే ఆర్ట్ డైరెక్టర్. 

ప్లానింగ్ లో సమస్య.. షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో రాంచరణ్ చిత్రానికి ఆర్ట్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. ఈ లోపు పుష్ప 2 ప్రారంభమైంది. నేడే ఈ చిత్ర లాంచింగ్ కార్యక్రమం జరిగింది. అలాగే షూటింగ్ కి సంబందించిన ప్రేపరేషన్స్ కూడా షురూ అయ్యాయి. దీనితో రామకృష్ణ తప్పని పరిస్థితుల్లో పుష్ప 2పై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. దీనితో రాంచరణ్ చిత్రం నుంచి తప్పుకున్నారట. 

దీనితో దిల్ రాజు ఈ చిత్రానికి రవీందర్ ని ఆర్ట్ డైరెక్టర్ గా నియమించారు. ఆయన కూడా కొన్ని రోజులు వర్క్ చేసి తప్పుకున్నారట. దీనితో ఆర్ట్ వర్క్ పెండింగ్ లో పడిపోతోంది. దిల్ రాజుకి ఇది పెద్ద సమస్యగానే మారుతున్నట్లు తెలుస్తోంది. 

రాంచరణ్, శంకర్ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాంచరణ్ కి జోడిగా ఈ మూవీలో కియారా అద్వానీ నటిస్తోంది. సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.