పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్లే. ‘పోకిరి’ చిత్రం అయితే మహేష్ కు  స్టార్‌డమ్ తీసుకొచ్చిన సినిమాల్లో  ఒకటిగా చరిత్రకెక్కింది.  ఆ తర్వాత వీరిద్దిరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బిజినెస్ మ్యాన్’ లో సూర్య భాయిగా అదిరిపోయే డైలాగులతో మహేష్ ని మరో మెట్టు ఎక్కించాడు పూరీ జగన్నాథ్.

ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌ కోసం ఇండస్ట్రీ, అభిమానులు ఎదురుచూసారు. దాంతో వీరి కాంబోలో మూడో సినిమాగా ‘జనగణమన’ అనే  సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా చేసే సమయానికి పూరీ జగన్నాథ్ వరుస డిజాస్టర్స్ తో దూసుకుపోతున్నాడు. అంతేకాదు పూరి చెప్పిన డైలాగులు అయితే బాగున్నాయి కానీ కథ,కథనం మహేష్ కు నచ్చక ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కానీ పూరి పట్టువదలని విక్రమార్కుడులా మహేష్ వెనకపడుతూనే ఉన్నాడు.

అందుతున్న సమాచారం మేరకు తాజాగా మహేష్ ని కలిసిన పూరి ఓ స్టోరీ లైన్ వినిపించారు.మహేష్ ఇప్పటిదాకా చెయ్యని  సరికొత్త క్యారక్టరైజేషన్ తో స్టోరీ నేరేట్ చేసాడట. విని వెంటనే ఎగ్జైట్ అయిన మహేష్ ...పూర్తి స్క్రిప్టుతో కనపడమని , ఖచ్చితంగా సినిమా చేద్దామని మాట ఇచ్చారట. దాంతో మరింత జోష్ తో పూరి ఆ స్క్రిప్టుపై కూర్చుంటన్నారట. రామ్ తో చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ పూర్తి అయ్యేలోగా ఈ స్క్రిప్టు పూర్తి చేసి ఓకే అనిపించుకోవాలనే తపనతో పూరి ఉన్నారట.