గత కొంత కాలంగా దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. వరుస ఫ్లాప్ ల మీదున్న దర్శకుడు పూరి తన తదుపరి సినిమా విషయంలో నిర్ణయం తీసుకోవడానికి కాస్త సమయం తీసుకున్నాడు.

ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థలో రామ్ హీరోగా సినిమా ప్రారంభించనున్నాడు. ఓ వైవిధ్యమైన కథతో సినిమాను రూపొందించనున్నారు. జనవరి రెండో వారం తరువాత ఈ సినిమా సెట్ మీదకు వెళ్లనుంది.

రామ్ సరసన హీరోయిన్ గా ఓ కొత్త అమ్మాయిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి చార్మీ సహనిర్మాతగా వ్యవహరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

త్వరలోనే సినిమాలో కాస్ట్, టెక్నికల్ టీమ్ ని అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా తరువాత పూరి మరోసారి తన కొడుకు ఆకాష్ తో సినిమా చేస్తాడని అంటున్నారు.