హాయ్..బాయ్.. లు చెప్పే గెలుపొటమలుతో నిత్యం పోరాడే వాడే అందరిని ఆకర్షిస్తుంటారు. ఆ తరహాలో పూరి జగన్నాథ్ కూడా హాట్ టాపిక్ గా మారాడు. గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతున్న ఈ సీనియర్ డైరెక్టర్ రామ్ తో ఒక ప్రాజెక్ట్ చేయడానికి డిసైడ్ అయ్యాడు. 

అయితే రామ్ మాత్రం వెంటనే ఒప్పుకోకుండా పూరి చేత కథలో చాలా మార్పులే చేయించాడని తెలుస్తోంది. ఫైనల్ గా స్క్రిప్ట్ రెడీ అవ్వడంతో రామ్ సినిమాను పట్టాలెక్కించాలని నిర్ణయం తీసేసుకున్నాడు. పూరి కూడా ఈ సినిమాకు ఎక్కువగా టైమ్ తీసుకోకుండా తన స్టైల్ లో విలైనంత త్వరగా ఫినిష్ చెయ్యాలని చూస్తున్నాడు. 

వచ్చే వారంలో రామ్ సినిమాకు సంబందించిన వివరాలని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడానికి ప్లాన్ జరుగుతున్నట్లు సమాచారం. పూరి ఫ్యాన్స్ కు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. మళ్ళీ తనదైన శైలిలో మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని పూరి అభిమానులు కోరుకుంటున్నారు. మరి పూరి ఏ స్థాయిలో హిట్ అందుకుంటాడో చూడాలి.