డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెబ్యూ మూవీ  'బద్రి' భారీ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన బద్రి విడుదలై 20ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ మూవీ తరువాత పవన్, పూరి మధ్య విబేధాలు రావడంతో ఇద్దరూ మరలా కలిసి పనిచేయలేదన్న టాక్ అప్పట్లో చక్కర్లు కొట్టింది. ఆ మూవీ విడుదలైన 12ఏళ్ల తరువాత కెమెరా గంగతో రాంబాబు చిత్రం చేశారు పూరి అండ్ పవన్. సోషల్ కాన్సెప్ట్ తో పొలిటికల్ సెటైర్ గా ఆ మూవీ తెరకెక్కింది. 


పూరి రాసిన డైలాగ్స్ బాగానే పేలినా.. సినిమా ఫలితం మాత్రం దెబ్బకొట్టింది. కెమెరామెన్ గంగతో రాంబాబు అనుకున్నంత విజయం సాధించలేదు. ట్రై యాంగిల్ లవ్ స్టోరీ బద్రితో హిట్ కొట్టిన పవన్-పూరి జోడి సోషల్ కాన్సెప్ట్ జోలికి వెళ్లి దెబ్బై పోయారు. కాగా పవన్ కళ్యాణ్ తో పూరి జగన్నాధ్ మూవీ ప్లాన్ చేస్తుండగా... ఇది కూడా ఓ సోషల్ కాన్సెప్ట్ తో కూడిన సబ్జెక్టు అన్నమాట వినిపిస్తుంది. లంచాలు, న్యాయవ్యవస్థలో లోపాలు, దోపిడీ ఆధారంగా స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. ఈ ప్రాజెక్ట్ కి పవన్ పచ్చ జెండా కూడా ఊపారట. 

మరి ఇదే నిజమైతే ఓ సారి ప్రతికూల ఫలితం వచ్చినప్పటికీ మరలా అదే తరహా సబ్జెక్టు ఎందుకు ట్రై చేస్తున్నారనే అనుమానం రాకమానదు. ఒకవేళ సీరియస్ పొలిటీషియన్ గా మారిన పవన్, కొంత మేర తనకు లబ్ధి చేకూరుతుందనే ఆలోచనతో సబ్జెక్టు నచ్చి ఒకే చేసి కూడా ఉండవచ్చని కొందరు అంటున్నారు. మరి ఈ వార్తలలో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం పవన్ వకీల్ సాబ్ షూట్ లో పాల్గొంటున్నారు. జనవరి నుండి అయ్యప్పనుమ్ కోశియుమ్ షూట్ స్టార్ట్ చేస్తారు. ఇక పూరి విజయ్ దేవరకొండ ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నారు.