దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో గాని చిత్ర యూనిట్ సినిమాపై పెట్టుకున్న నమ్మకం మాత్రం మాములుగా లేదు. ముఖ్యంగా దర్శకుడు పూరి ఈ సినిమాతో హిట్టు కొట్టే తీరాలి. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు స్టార్ హీరోల చేయాలంటే బాక్సాఫీస్ హిట్ కొట్టాల్సిందే. 

ఆ స్టార్స్ లిస్ట్ లో బాలకృష్ణ కూడా ఉన్నాడు. పైసా వసూల్ సినిమా షూటింగ్ సమయంలోనే పూరి జగన్నాథ్ తో ఒక స్టోరీ లైన్ అనుకున్నాడు.  తప్పకుండా చేస్తానని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ చెప్పాడు. అయితే కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన బోయపాటినే ఫామ్ లో లేడని బాలకృష్ణ పక్కనపెట్టేశాడు. వినయవిధేయ రామ రిలీజ్ కు ముందు ప్రాజెక్ట్ సెట్టయింది అనుకునే లోపే డిజాస్టర్ అనంతరం బ్రేక్ పడింది. 

ఇక బాలయ్యతో పని చేసిన మొదటిసారే డిజాస్టర్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ని నమ్మాలంటే ఇస్మార్ట్ శంకర్ తో బాక్స్ ఆఫీస్ హిట్ కొట్టక తప్పదు. మరి పూరి ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఈ నెల 18న ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.