డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం  డబుల్ ఇస్మార్ట్.  లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ కెరీర్ ఎలా మారుతుంది అనే చర్చ ఎక్కువగానే జరిగింది. కానీ పూరి జగన్నాధ్ అంటే ఎప్పటికీ బ్రాండే.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ కెరీర్ ఎలా మారుతుంది అనే చర్చ ఎక్కువగానే జరిగింది. కానీ పూరి జగన్నాధ్ అంటే ఎప్పటికీ బ్రాండే. ఆయనతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటారు. కానీ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి కూడా తనని తాను ప్రూవ్ చేసుకుని బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. 

ఇస్మార్ట్ శంకర్ కి ధీటుగా డబుల్ ఇస్మార్ట్ ఉండేలా పూరి ప్రయత్నిస్తున్నాడు. రామ్ పోతినేనికి కూడా ఈ చిత్రం విజయం సాధించడం చాలా అవసరం. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర షూటింగ్ 90 శాతం పూర్తయింది. అయితే ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు. ఒక్క సాంగ్ కూడా రిలీజ్ చేయలేదు. 

రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. దీనితో తెరవెనుక ఏం జరుగుతోంది అనే చర్చ జరుగుతోంది. అయితే జరుగుతున్న ప్రచారం ప్రకారం పూరి జగన్నాధ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తి కావడం కోసం ఎదురుచూస్తున్నారట. పెద్ద బ్యానర్లు అయితే వెంటనే నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగిపోతుంది. ఇది పూరి సొంతంగా పెట్టుకున్న నిర్మాణ సంస్థ. దీనితో కాస్త ఆలస్యం అవుతోందట. 

డిజిటల్, శాటిలైట్స్ ఇలా నాన్ థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ అయ్యాక ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో పూరి ఉన్నారట. ఆల్రెడీ ఈ చిత్ర బిజినెస్ 50 కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. సినిమా మేకింగ్ లో పూరి స్పీడు అందరికి తెలిసిందే. అయితే గత చిత్రం లైగర్ తో దారుణంగా దెబ్బతినడంతో డబుల్ ఇస్మార్ట్ బిజినెస్ విషయంలో పూరి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.