మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు తన 38వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు రాంచరణ్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు తన 38వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. సినీ ప్రముఖులు, అభిమానులు రాంచరణ్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మెగా ఫ్యాన్స్ అయితే కొన్ని రోజుల నుంచే హంగామా మొదలు పెట్టారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ గా మారడంతో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. 

అభిమానుల జోష్ ని పెంచేలా రాంచరణ్, శంకర్ మూవీ టైటిల్ కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి గేమ్ ఛేంజెర్ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. రాంచరణ్ బర్త్ డే కావడంతో చరణ్ గురించి ఫ్యాన్స్ కి తెలియని కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు లుక్స్, నటన విషయంలో విమర్శలు ఎదుర్కొన్న చరణ్ నేడు గ్లోబల్ స్టార్ గా ప్రశంసలు పొందుతున్నాయి. అసలు ఈ అద్భుత ప్రయాణం మొదలైంది 2007 చిరుత చిత్రంతో. 

పూరి జగన్నాధ్ గతంలో ఈ చిత్రం గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు వైరల్ అవుతున్నాయి. తన వారసుడిగా రాంచరణ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత చిరంజీవి పూరి జగన్నాధ్ కి అప్పగించారు. మొదట రాజమౌళినే అనుకున్నా.. జక్కన్న మాత్రం తాను చరణ్ తో రెండవ చిత్రం చేస్తానని చెప్పారట. 

అలా చిరుత చిత్రం ట్రాక్ ఎక్కింది. బ్యాంకాక్ లో ఓ సాంగ్ తో షూటింగ్ ప్రారంభించారట. హీరోయిన్ నేహా శర్మ, రాంచరణ్ ఇద్దరూ ఇండస్ట్రీకి కొత్తే. కాబట్టి కాస్త సిగ్గు బిడియం ఉంటాయి. అందుకే వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగేందుకు పూరి మొదట సాంగ్ షూట్ ప్లాన్ చేశారట. కొన్ని రోజుల పాటు బ్యాంకాక్ లో సాంగ్ షూటింగ్ జరిగింది. ఆ సమయంలో బ్యాంకాక్ లో ఎండలు విపరీతంగా ఉన్నాయి. బీచ్ ప్రాంతం కావడంతో హ్యుమిడిటీ కూడా ఎక్కువ. 

అంతకుముందెప్పుడూ చరణ్ కానీ, నేహా కానీ అన్ని రోజులు ఎండలో ఉండలేదు. పైగా ఇద్దరికీ బ్యాంకాక్ వాతావరం సెట్ కాలేదు. దీనితో పూర్తిగా నల్లగా అయిపోయారట. పూరి కాస్త కంగారుతో ఇద్దరినీ స్కిన్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారట. బ్యాంకాక్ వాతావరణం పడక రాంచరణ్, నేహా చర్మంలో మొదటి లేయర్, రెండవ లేయర్ పాడయ్యాయి అని.. ఇంకాస్త ఆలస్యం జరిగుంటే ఇద్దరూ శాశ్వతంగా నల్లగా అయిపోయేవారని డాక్టర్ చెప్పడంతో పూరి షాక్ అయ్యారట. మొత్తంగా చరణ్ మొదటి చిత్రం చిరుత సూపర్ హిట్ గా నిలిచింది.