Asianet News TeluguAsianet News Telugu

#PuriJagannadh: ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన పూరీ జగన్నాథ్‌

తాను ప్రస్తుతం ముంబాయిలో వుంటున్నానని, హైదరాబాద్ లోని తన ఇంట్లో వృద్ధురాలైన అత్తగారు, తన భార్య, కుమార్తె మాత్రమే వున్నారని, వరంగల్ శ్రీను, శోభన్ తన ఇంటి మీదకు దాడి చేస్తారని భయంగా వుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Puri Jagannadh lodges complaint against Warangal Srinu
Author
First Published Oct 26, 2022, 11:31 PM IST

జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ పోలీసులను ఆశ్రయించారు. డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై, తన కుటుంబంపై హింసకు పాల్పడేలా వీరు ఇతరులను ప్రేరేపిస్తున్నట్లు కంప్లైంట్‌లో పేర్కొన్నారు. వారి నుంచి తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని పూరి జగన్నాధ్ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. 

శ్రీను, శోభన్‌లు డబ్బుల విషయంలో తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని, వారి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల క్రితం పూరీ వాయిస్‌తో విడుదలైన ఆడియో ఫైల్ వైరల్‌గా మారింది. అందులోనూ.. ‘లైగర్’ వల్ల నష్టపోయిన బాధితులంతా ఈ నెల 27న తన ఇంటి ముందు ధర్నా చేయబోతున్నారని, తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారని పూరీ వాపోయారు. డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పినా పలువురు డిస్ట్రిబ్యూటర్లు బెదిరింపులకు పాల్పడ్డారని పూరీ ఆరోపించారు. డిస్ట్రిబ్యూటర్లు తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందన్న అనుమానంతో ముందస్తుగా భద్రత కల్పించాలని పూరీ జగన్నాథ్ పోలీసులను కోరారు.

 ఈ విషయంలో పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారు. తనను ఇద్దరు వ్యక్తులు బెదిరిస్తున్నారని అంటూ, ఫైనాన్షియర్ శొభన్, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుల పేర్లను పూరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను ప్రస్తుతం ముంబాయిలో వుంటున్నానని, హైదరాబాద్ లోని తన ఇంట్లో వృద్ధురాలైన అత్తగారు, తన భార్య, కుమార్తె మాత్రమే వున్నారని, వరంగల్ శ్రీను, శోభన్ తన ఇంటి మీదకు దాడి చేస్తారని భయంగా వుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎగ్జిబిటర్లు పోగు చేసి, వాట్సాప్ ల్లో తన ఇంటి మీదకు దాడి చేసేలా ప్రోత్సహిస్తున్నారని పూరి వివరించారు.

వాస్తవానికి వరంగల్ శ్రీను అగ్రిమెంట్ ను అమలు చేయడంలో విఫలమయ్యారని పూరి జగన్నాధ్ వివరించారు. లైగర్ సినిమాను అనుకున్న మొత్తానికి వరంగల్ శ్రీను కొనలేకపోయారు. దాంతో కొన్ని ఏరియాలను పూరి కనెక్ట్స్ సంస్థ వేరే పార్టీకి అమ్మేసారు. 

చిరంజీవి తో చేసిన ఆచార్య సినిమా డిజాస్టర్ అయినా సరే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా నైజాం రైట్స్ సొంతం చేసుకున్నారు వరంగల్ శ్రీను.పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తే వచ్చే లాభం అంతే ఉంటుంది. ఒకవేళ సినిమా తేడా కొడితే వచ్చే లాస్ కూడా అంతే ఉంటుంది.ఈ క్రమంలో ఆచార్య లాస్ వచ్చిందని బాధపడకుండా మళ్లీ లైగర్ కోసం భారీ మొత్తాన్ని పెట్టేసారు వరంగల్ శ్రీను. అయితే ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. బారీ నష్టాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడదే వివాదానికి అంకురార్పణ చేసింది.

విజయ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన చిత్రం పాన్‌ ఇండియా చిత్రమే ‘లైగర్‌’. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఆగస్టు 25న విడుదలై, బాక్సాఫీసు వద్ద పరాజయాన్ని చవిచూసింది.  ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థతో కలిసి పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు.

Follow Us:
Download App:
  • android
  • ios