పూరీ జగన్నాథ్ బర్త్ డే.. ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి స్పెషల్ పోస్టర్.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే.!
డాషింగ్ డైరెక్టర్ పూరీ బర్త్ డే సందర్భంగా ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదలైంది. ఎనర్జిటిక్ లుక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పోస్టర్ వైరల్ గా మారింది.
డాషింగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) గురించి తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో మాస్ సినిమాకు నయా కొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు ఆయన. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలుగా ఎదగిన వారిందరి కెరీర్ పూరీ సినిమాతోనే టర్న్ అయ్యిందనేది ఓపెన్ సీక్రెట్. ప్రొఫెషనల్ గా తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేశారు. విజయేంద్ర ప్రసాద్ లాంటి స్టార్ రైటర్ పూరీ జగన్నాథ్ ఫొటోను మొబైల్ వాల్ పోస్టర్ గా పెట్టుకున్నారంటే పూరీ ఆయన గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక, ఈరోజు పూరీ జగన్నాథ్ పుట్టిన రోజు కావడం విశేషం. 1996 సెప్టెంబర్ 28న ఏపీలోని పిఠాపురంలో జన్మించారు. నేటితో పూరీ 56వ ఏటా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. స్పెషల్ పోస్టర్లతో సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు. పూరీ బర్త్ డే కావడంతో Double Ismart నుంచి ఓ స్పెషల్ పోస్టర్ ను కూడా యూనిట్ విడుదల చేసింది.
‘మాస్ సినిమాని తనదైన శైలిలో పునర్నిర్వచించిన క్రాఫ్ట్ మెన్... మా సెన్సేషనల్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కి DoubleISMART టీమ్ నుంచి బ్లాక్ బస్టర్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నాం’ అంటూ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ లో కేవలం పూరీ జగన్నాథ్ నే కాకుండా ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni), ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) తో కలిసి ఉన్న పోస్టర్ ను విడుదల చేశారు. గన్స్ పట్టుకొని, ఫైరింగ్ కు రెడీ అనేలా స్టిల్స్ ఇచ్చి ఆకట్టుకున్నారు.
పోస్టర్ లో పూరీ బ్యూటీపుల్ స్మైల్ తో ఆకట్టుకున్నారు. దీంతో ఫ్యాన్స్ బాస్ బ్లాక్ బాస్టర్ తో కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ పుట్టిన రోజు తిరుగులేని సక్సెస్ ను ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఇక ‘డబుల్ ఇస్మార్ట్’లో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. పూరీ దర్శకత్వం. పూరీ కనెక్ట్స్ పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమం పూర్తై, రామ్ పోతినేని, సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా విడుదలయ్యాయి. అలాగే 2024 మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో గ్రాండ్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.