డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రం మాస్ సెంటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పూరి జగన్నాధ్ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన చిత్రాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. తాను పనిచేసిన హీరోలందరి గురించి మాట్లాడుతూ జూ. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయం తెలిపాడు. 

జూ. ఎన్టీఆర్ కు ర్యాష్ డ్రైవింగ్ చేసే అలవాటుందట. గోవాలో టెంపర్ చిత్ర షూటింగ్ జరుగుతున్నపుడు ప్రతి రోజు ఎన్టీఆర్ కారులో తనని దూరంగా తీసుకెళ్లేవాడని పూరి తెలిపాడు. ఎన్టీఆర్ డ్రైవింగ్ చేస్తే మాములుగా ఉండదు. ఇంకొక్క సారి కారు ఎక్కకూడదు అనిపించింది. మేఘాల్లో తేలుతూ కారుని నడిపిస్తాడు. ఎన్టీఆర్ డ్రైవింగ్ చేస్తే మినిమం 100 స్పీడ్ వెళ్లాల్సిందే అని పూరి తెలిపాడు. 

గతంలో ఇలాంటి అనుభవం జెడి చక్రవర్తికి కూడా ఎదురైంది. ఎన్టీఆర్ వేగం చూసి ఇక జీవితంలో అతడి కారు ఎక్కను అంటూ జెడి చక్రవర్తి తెలిపాడు.