Asianet News TeluguAsianet News Telugu

'డబుల్ ఇస్మార్ట్' రైట్స్ మరీ అంత ఎక్కువ చెప్తున్నారా? !! పూరి ధైర్యమేంటో

లైగర్ సినిమా ప్లాప్ అవ్వడంతో జనగణమన తీసేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు. దీనితో ఈ సినిమా ఆగిపోయింది. 

Puri Jagan Double iSmart anticipates fancy offer jsp
Author
First Published Jun 26, 2024, 1:57 PM IST


లైగర్ ఫ్లాప్ తర్వాత ఆరేడు నెలల పాటు కొత్త సినిమా ఏదీ ప్రకటించని ఈయన.. చివరికి రామ్‌తోనే మరోసారి ఇస్మార్ట్ కథను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై టీజర్ రిలీజ్ తర్వాత అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అందుకే ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. పేరుకు తెలుగు సినిమా అయినా.. పూర్తిగా బాలీవుడ్ స్టైల్‌లోనే తెరకెక్కిస్తున్నారు పూరీ. సంజయ్ దత్ రాకతో హిందీలోనూ దీనిపై క్రేజ్ పెరిగింది. ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదల కానుంది. కావ్య థపర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ కూడా మొదలైంది. అయితే పూరి జగన్ చెప్తున్న రేట్లుకు డిస్ట్రిబ్యూటర్స్ దడుసుకుంటున్నారనే వార్త ట్రేడ్ లో వినిపిస్తోంది.

అందుతున్న సమాచారం మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 50 కోట్ల వరకూ చెప్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ బడ్జెట్ బాగా ఎక్కువ కావటంతో ఈ రేటు చెప్తున్నారని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి ముందు చేసిన లైగర్ కు ఇలాగే భారీ రేట్లకు అమ్మారు. అయితే సినిమా డిజాస్టర్ కావటంతో ఆ సెటిల్మెంట్స్ చేయాల్సి వచ్చింది. చాలా వివాదాలు వచ్చాయి. దాంతో ఈ సారి అలాంటి సమస్య రాకూడదని ఆచి,తూచి అడుగులు వేస్తున్నారట. 
 
లైగర్ సినిమాతో దర్శకుడు పూరీజగన్నాధ్ భారీగా నష్టపోయారు. లైగర్ సినిమా ప్లాప్ తో ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు స్టార్స్ ఎవ్వరూ కూడా దైర్యం చేయలేదు.లైగర్ సినిమా విడుదల అవ్వక ముందే పూరీజగన్నాధ్ తన డ్రీం ప్రాజెక్ట్ అయిన జనగణమన సినిమాను విజయ్ దేవరకొండతో మొదలు పెట్టాడు. లైగర్ సినిమా ప్లాప్ అవ్వడంతో జనగణమన తీసేందుకు నిర్మాతలు ముందుకు రాలేదు. దీనితో ఈ సినిమా ఆగిపోయింది. ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న టైం లో హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ప్లాన్ చేయగా ఆ సినిమాకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డబుల్ ఇస్మార్ట్ మూవీ మొదలైంది. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

  మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ,టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే డబుల్ ఇస్మార్ట్ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు.ప్రమోషన్ లో భాగంగా డబుల్ ఇస్మార్ట్  నుంచి ఊర మాస్ పటాక సాంగ్ రెడీ అంటూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.త్వరలోనే మ్యూజిక్ జాతర లోడింగ్ అంటూ మేకర్స్ ట్వీట్ చేసారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios