సినీ ప్రపంచమంతా ఓటీటిల వైపు చూస్తోంది. ఇప్పటికే చాలా మంది నటులు, దర్శకులు ఓటీటిలతో ఎగ్రిమెంట్ చేసుకుంటున్నారు. భవిష్యత్ ఓటీటీలదే అనే నినాదంతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా కరోనా,లాక్ డౌన్ లతో ఎప్పటికి థియోటర్స్ ఓపెన్ అవుతాయో తెలియని సిట్యువేషన్ లో ఓటీటిలను జనం బాగా ఆదరిస్తున్నారు. ఈ నేపధ్యంలో వినియోగదారులను పెంచుకోవటానికి స్టార్ డైరక్టర్స్ కు ఎర వేస్తున్నాయి ఓటీటి సంస్దలు. భారీ మొత్తాలతో ఎప్రోచ్ అవుతున్నాయి. ఇప్పటికే తెలుగు నుంచి తేజ వంటి కొందరు దర్శకులు ఓటీటిల వైపు మ్రొగ్గుచూపారు. వెబ్ సీరిస్ లతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు పూరీ జగన్నాథ్ సైతం అటు వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

పూరి జగన్నాథ్ సినిమాలకు కో ప్రొడ్యూసర్ గా చేస్తున్న ఛార్మి చెప్పిన దాని ప్రకారం త్వరలో ఓ సాలీడ్ వెబ్ సీరిస్ తో పూరి మన ముందుకు రానుున్నారు. ఆ సీరిస్ షాకింగ్ గా ఉంటుందని, హార్డ్ హిట్టింగ్ గా ఉంటుందని చెప్తోంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్ధలతో పూరి చర్చలు చేస్తున్నారట. ఈ మేరకు ఓ ఆఫీస్ ని ముంబైలో పెట్టి వరస పెట్టి ఓటీటిలకు ప్రాజెక్టులు చేయనున్నారని వినికిడి. తన స్క్రిప్టు,పర్యవేక్షణలో తన దగ్గర పనిచేసిన డైరక్షన్ డిపార్టమెంట్ కుర్రాళ్లకు ఈ ఓటీటిలలో పని కల్పించే విధంగా పూరి ప్లాన్ చేస్తున్నారని  ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. 

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం లో 'ఫైటర్' అనే పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. తెలుగు హిందీతో పాటు ఇతర భాషలలో రూపొందుతున్న ఈ సినిమాను భారీగా పూరి తెరకెక్కిస్తున్నారు.అయితే  విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీకి టైటిల్ 'ఫైటర్' కాదని.. కేవలం ఫైటర్ అనేది వర్కింగ్ టైటిల్  అని ఛార్మి చెప్పారు. ఇక ఈ సినిమా కోసం మరో మంచి టైటిల్ అనుకుంటున్నారట. ఆ టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేస్తామని ఛార్మి వెల్లడించింది.