గత కొంతకాలంగా దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్ పరంగా వెనకపడ్డారు. అయితే ఆయన ఉత్సాహంలో ఎక్కడా వెనకబడలేదు. తన రెగ్యులర్ యాక్టివిటీస్ లోనూ ఎక్కడా మార్పులేదు. 

గత కొంతకాలంగా దర్శకుడు పూరి జగన్నాథ్ కెరీర్ పరంగా వెనకపడ్డారు. అయితే ఆయన ఉత్సాహంలో ఎక్కడా వెనకబడలేదు. తన రెగ్యులర్ యాక్టివిటీస్ లోనూ ఎక్కడా మార్పులేదు. పగలంతా తన కుమారుడు ఆకాష్ చిత్రానికి స్క్రిప్టు వర్క్. రాత్రిళ్లు తన స్నేహితులతో పిచ్చాపాటి కబుర్లు, పార్టీలు. ఈ సెటప్ అంతా ఆయన ఆఫీస్ కేవ్ లో జరుగుతుంది. ముఖ్యంగా వీకెండ్స్ అయితే ఆ రచ్చ వేరు అని కేవ్ కు పర్మనెంట్ కష్టమర్స్ అయిన ఆయన స్నేహితులు చెప్తూంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఇక అసలు విషయానికి వస్తే..ఈ వారం ఈ కేవ్ లో పార్టీకు హాజరైంది ఎవరో తెలుసా ప్రముఖ దర్శకుడు సుకుమార్. పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి ఎలాగో అక్కడే ఉంటోంది. ఇక హీరో శ్రీకాంత్, అల్లరి నరేష్, తరుణ్,సుదీప్ లు కూడా ఈ పార్టీలో కనిపించారు. 

ఈ విషయం మీకు ఎలా తెలుసు అంటారా..ఈ ఫొటోలు చూస్తే తెలుస్తుంది. ఆ ఫొటోలను ఛార్మీ తన సోషల్ నెట్ వర్క్ సైట్ లో అప్ లోడ్ చేసి తమ ఉత్సాహాన్ని ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేసింది. ఇంతకీ సుకుమార్ ఆ పార్టీకు రావటం వెనకాల ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా..పూరి కుమారుడు ప్రాజెక్టులో సుకుమార్ ని ఏమైనా కలిపే ప్రయత్నం జరుగుతోందా ఏమో..ఏదైనా జరగచ్చు. 

View post on Instagram