కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఈరోజు ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్. మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి ఈరోజు ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్.
భారీ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది దివంగత కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ జేమ్స్ మూవీ.ఆయన చివరి చిత్రం కావడంతో కన్నడ అభిమానులు భారీగా నివాళి అర్పించడానికి రెడీ అవుతున్నారు. కర్ణటక వ్యాప్తంగా జేమ్స్ మూవీని అన్ని థియేటర్లలో పునిత్ గౌరవార్ధం కొన్ని రోజులు నడిపించాలని నిర్ణయించారు.
ఇక ఈరోజు రిలీజ్ అయిన ఈ సాంగ్‌కు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుండటంతో.. మేకర్స్ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న విడుదల కాబోతోన్న ఈ చిత్రం కూడా అందరినీ అలరిస్తుందని ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.జేమ్స్ సినిమాను హీరో శ్రీకాంత్, విజయ్. ఎమ్ సంయుక్తంగా తెలుగు లో రిలీజ్ చేయబోతున్నారు.
ఈసినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ ను త్వరలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఛీఫ్ గెస్ట్ గా హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున పునిత్ ఫ్యాన్స్ ప్రి రిలీజ్ కు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
పునీత్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు.చేతన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రిపబ్లిక్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.. ప్రస్తుతం సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయినట్లుగా నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో పునీత్ రాజ్‌కుమార్ తో పాటు డాక్టర్ శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు నటించారు.
