లెజెండరీ యాక్టర్‌ రాజ్‌కుమార్‌ గ్రాండ్‌ సన్‌, రాజ్‌కుమార్‌ పెద్ద కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ కుమారుడు యువ రాజ్‌కుమార్‌ సినీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని బుధవారం ప్రకటించారు. 

శాండల్‌వుడ్‌ పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇస్తున్నారు. మూడో తరం నటన వారసుడి ఎంట్రీకి లైన్‌ క్లీయర్‌ అయ్యారు. లెజెండరీ యాక్టర్‌ రాజ్‌కుమార్‌ గ్రాండ్‌ సన్‌, రాజ్‌కుమార్‌ పెద్ద కుమారు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ కుమారుడు యువ రాజ్‌కుమార్‌ సినీ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని బుధవారం ప్రకటించారు. `కేజీఎఫ్‌`, `సలార్‌` చిత్రాలను నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌ యువ రాజ్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాని విడుదల చేయబోతున్నారు. తాజాగా యువ రాజ్‌కుమార్‌ లుక్‌తో ఈ సినిమాని ప్రకటించారు. 

`రాజకుమారా`, `మిస్టర్‌ అండ్‌ మిస్‌ట్రెస్‌ రామాచారి` వంటి చిత్రాలను రూపొందించిన సంతోష్‌ ఆనంద్రామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో యువరాజ్‌కుమార్‌ స్టయిలీష్‌గా, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. కన్నడ రాజ్‌కుమార్‌ ఫ్యామిలీలో పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ లేని లోటుని యువరాజ్‌కుమార్‌ తీర్చబోతున్నాడనే సంకేతాలను ఫ్యాన్స్ కి ఈ లేటెస్ట్ లుక్‌ ఇవ్వబోతుండటం విశేషం. 

Scroll to load tweet…

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ నట వారసులుగా రాణిస్తున్నారు శివరాజ్‌కుమార్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌. అయితే గతేడాది పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యింది. రాజ్‌కుమార్‌ ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం శివరాజ్‌కుమార్‌ నటిస్తున్నారు. వీరి అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ మొదట్లో ఒకటి రెండు చిత్రాల్లో నటించారు. కానీ ఆయనసినిమాలు పెద్దగా ఆదరణ పొందలేదు. యాక్టింగ్‌ ఆయనకు కలిసి రాలేదు. దీంతో దూరంగా ఉన్నారు. నిర్మాణం వైపు బిజీగా ఉన్నారు. తాను చేయలేనిది తన కుమారుడు యువరాజ్‌కుమార్‌తో చేయించబోతున్నారని చెప్పొచ్చు. అయితే ఈ కొత్త సినిమాకి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.