Asianet News TeluguAsianet News Telugu

Puneeth Rajkumar death: పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని తట్టుకోలేక ఇద్దరు అభిమానులు మృతి..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (puneeth rajkumar) హఠాన్మరణంతో శాండల్‌వుడ్‌లోనే కాకుండా, భారత చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్తను సినీ ప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన నటుడు ఇకలేరనే వార్త‌తో పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.

Puneeth rajkumar death Two fans of Kannada film star Puneeth Rajkumar died
Author
Bengaluru, First Published Oct 30, 2021, 2:58 PM IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ (puneeth rajkumar) హఠాన్మరణంతో శాండల్‌వుడ్‌లోనే కాకుండా, భారత చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్తను సినీ ప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన నటుడు ఇకలేరనే వార్త‌తో పునీత్ రాజ్‌కుమార్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఆయన ఉదయం ఆస్పత్రిలో చేరారనే వార్త తెలియగానే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆయన మరణించారనే విషయాన్ని వారు నమ్మలేకపోతున్నారు. పునీత్ కడసారి చూపు కోసం ఆయన పార్థీవ దేహాన్ని ఉంచి కంఠీరవ స్టేడియానికి (Kanteerava Stadium) సినీ ప్రముఖులతో పాటుగా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు.

ఇదిలా ఉంటే పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్తను తట్టుకోలేక ఇద్దరు అభిమానులు ప్రాణాలు విడిచారు. అందులో ఒకరు గుండెపోటుతో మరణించగా, మరోకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు వార్త కథనాలు వెలువడ్డాయి. పునీత్ మరణంతో కర్ణాటకలోని చామరాజ్‌నగర్ జిల్లా హనూర్ తాలూకా మరూరు గ్రామానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. అతని పేరు మునియప్ప, అతని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను ఒక రైతు. మరో ఘటనలో ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఓ అభిమాని పునీత్ మరణాన్ని తట్టుకోలేక అరచేతిని కోసుకున్నట్టుగా సమాచారం.  

Also read: Puneeth rajkumar death: పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు రేపటికి వాయిదా

అంత్యక్రియలకు కర్ణాటక ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. తన తండ్రి రాజ్ కుమార్ సమాధి పక్కనే పునీత్ కు కూడా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దాదాపు 6 వేలమంది పోలీసులతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.  పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపనున్నట్టుగా  కర్ణాటక ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

మరోవైపు పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఆదివారానికి వాయిదా వేశారు. కుటుంబసభ్యుల రాక ఆలస్యంతో అంత్యక్రియలు వాయిదా వేసినట్లుగా కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) బసవరాజ్ బొమ్మై (basavaraj bommai) అధికారికంగా ప్రకటించారు. ముఖ్యంగా పునీత్ కుమార్తె ధృతీ (dhriti rajkumar ) అమెరికా నుంచి ఇంకా రాకపోవడంతో అంత్యక్రియలు రేపటికి వాయిదా పడ్డాయి. 

ALso Read:Puneeth rajkumar death: తల బాదుకుంటూ కన్నీరు మున్నీరైన బాలకృష్ణ.. పునీత్ పార్థివదేహం ముందు ఇలా

సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పునీత్ రాజ్‌కుమార్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ప్రధాని మోదీ కూడా తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. విధి చాలా క్రూరమైనదని అన్నారు. పులువరు సినీ ప్రముఖులు పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ దేహానికి నివాళులర్పించడానికి బెంగళూరు వెళ్తున్నారు. ఇప్పటికే సినీ హీరో బాలకృష్ణ పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.పునీత్ రాజ్‌కుమార్‌కు జానియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. పునీత్ పార్థీవదేహాన్ని చూస్తూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. తారక్ అక్కడికి చేరుకోగానే పునీత్ సోదరుడు శివ రాజ్‌కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో ఆయనను తారక్ ఓదార్చారు.  

పునీత్ కడసారి చూపు కోసం Chiranjeevi ఈ మధ్యాహ్నం బెంగళూరు వెళ్లనున్నారు. అలాగే నటులు నరేష్, శివ బాలాజీ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఇళయదళపతి విజయ్ కూడా పునీత్ అంత్యక్రియలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios