తెలుగు నటి, బిగ్‌బాస్‌3 ఫేమ్‌ పునర్నవి భూపాలం.. నిన్న ఫ్యాన్స్ అందరికి షాక్‌, సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. వేలికి రింగ్‌ చూపించి కథ మొత్తం అల్లుకునేలా చేసింది. `ఫైనల్‌గా.. ఇది జరిగింద`ని పేర్కొంది. అబ్బాయి ఎవరు? ఏం చేస్తుంటాడనే వివరాలు తెలపలేదు. నెటిజన్లు ఆమెని ప్రశ్నించగా రేపు(అక్టోబర్‌ 30)న వెల్లడిస్తానని తెలిపింది. 

తాజాగా మరో సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది పునర్నవి భూపాలం. తాను చేసుకునే వాడిని నెటిజన్లకి, అభిమానులకు పరిచయం చేసింది. ఉద్భవ్‌ అనే ఫిల్మ్‌ మేకర్‌ని మ్యారేజ్‌ చేసుకోబోతున్నట్టు తెలిపింది. ఆయన అసలు పేరు ఉద్భవ్‌ రఘునందన్‌. నటుడు, రైటర్‌, ఫిల్మ్ మేకర్‌ కావడం విశేషం. చికాగో సుబ్బారావు పేరుతో యూట్యూట్‌ ఛానెల్‌ని నిర్వహిస్తున్నారు. ఇందులో సెటైరికల్‌ కామెడీ వంటి అనేక వీడియోస్‌ రూపొందిస్తుంటారు. ఇలా యూట్యూబ్‌లో పాపులర్‌ అయ్యారు. దీంతో ఆయన్ని `చికాగో సుబ్బారావు` అని కూడా పిలుస్తుంటారు. 

తాజాగా ప్రియుడి ఫోటోని షేర్‌ చేసింది పునర్నవి. షేడ్‌తో ఉద్భవ్‌ కనిపించేలా, ఫ్రంట్‌లో తన వేలికి ఉంగరం ఉన్న చేయిని చూపిస్తూ ఓ ఫోటోని పునర్నవి పంచుకుంది. రేపు బిగ్‌డే అంటూ మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపింది. మరోవైపు ఉద్భవ్‌ సైతం పునర్నవితో ఉన్న ఫోటోని పంచుకుంటూ `ఆమె ఎస్‌ చెప్పింది. రేపు బిగ్‌డే చాలా విషయాలు చెప్పేందుకు ఆగలేకపోతున్నా` అని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.