యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం 'సాహో'. ఇటీవల ఈ సినిమా తొలిపాట టీజర్ ని విడుదల చేసిన చిత్రబృందం ఇప్పుడు పూర్తి వీడియోను రిలీజ్ చేసింది.

'సైకో సయ్యాన్..' అంటూ సాగే ఈ పాట మ్యూజిక్ బాగున్నప్పటికీ లిరిక్స్ మాత్రం అర్ధం కాని విధంగా ఉన్నాయి. ఓ తెలుగు పాట వింటున్న ఫీలింగ్ అయితే అసలే కలగదు. డబ్బింగ్ సాంగ్ మాదిరి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే పాటలో ప్రభాస్ మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నాడు.

పార్టీలో శ్రద్ధ మద్యం తాగుతూ ప్రభాస్ తో కలిసి డాన్స్ చేస్తూ కనిపిస్తుంది. తన అందం, డాన్స్ లతో శ్రద్ధా ఆకట్టుకుంటోంది. సుజీత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్ట్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.