రిలీజ్ కు ముందే రికార్డ్ ల మోత మోగించేస్తోంది ప్రభాస్ ప్రాజెక్ట్ కె మూవీ.  పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈసినిమా.. ఆ స్థాయిలోనే అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది.  


భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో... వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యాన్స్ ఈసినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదరు చూస్తూ ఉన్నారు. ఇక ఈసినిమాలో ప్రభాస్ జోడీగా బాలీవుడ్ సీనియర్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తుండగా.. దిగ్గజ నటులైన అమితాబ్, కమల్ హాసన్ తో పాటుగా దిశా పఠాని లాంటిస్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కమల్ హాసన్ ఈమూవీలో ప్రభాస్ కు విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే ప్రాజెక్ట్ K మీద భారీ అంచనాలు ఉన్నాయి.అవి అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. వాటిని రెట్టింపు చేస్తూ.. మూవీ టీమ్ మరో అప్ డేట్ ను అందించింది. ప్రభాస్ ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేసింది. ఇంతకీ అసలు విషయం ఏంటీ అంటే...? ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో కామిక్ కాన్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి అనేకమంది సినిమా ప్రేమికులు, కామిక్ బుక్స్ అభిమానులు ఈ ఈవెంట్ కి వస్తారు. ఈ వేడుకల్లో కామిక్ బుక్స్ తో పాటు... సినిమాలను కూడా కామిక్స్ లాగా మార్చి ప్రదర్శిస్తారు. 

ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా దాదాపు అయిదు రోజుల పాటు నిర్వహించబోతున్నారు. . ఈ సంవత్సరం జులై 19 రాత్రి పార్టీతో ఈ ఈవెంట్ మొదలవుతుంది. జులై 23 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. జులై 20న ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంతో పాటు ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ పాల్గొననున్నారు. అదే రోజు ప్రాజెక్ట్ K సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. ప్రస్తుతం ఈ న్యూస్సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. రిలీజ్ కు ముందే ఇలాంటి ఘనతలు సాధిస్తున్న ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమా.. రిలీజ్ తరువాత రికార్డ్స్ బ్రేక్ అయ్యేలా ప్లాన్ చేశారు టీమ్.