హిట్ సినిమాలు తమ ఖాతాలో ఉంటే పెద్ద హీరోలు ఆ దర్శకుడుతో చేయటానికి ఉత్సాహం చూపుతారనటంలో సందేహం లేదు. అయితే నిర్మాతలు మధ్యలో చేరి ఓ ఫిటింగ్ పెడుతున్నారు. పెద్ద హీరో డేట్స్ మా దగ్గర ఉన్నాయి..ప్రాజెక్టు  మేము సెట్ చేస్తాం...అయితే ఓ కండీషన్ ...నువ్వు రెమ్యునేషన్ విషయంలో పట్టు పట్టకూడదు అని క్లియర్ గా చెప్తున్నారు. ఇలాంటి అనుభవం రీసెంట్ గా దర్శకుడు అనీల్ రావిపూడికు ఎదురైందని సమాచారం. 

'పటాస్, సుప్రీమ్, రాజాది గ్రేట్, ఎఫ్-2' చిత్రాలతో వరుస సక్సెస్‌లు కొట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి.. వరుస పెట్టి హిట్స్ ఇవ్వటంతో ఈ దర్శకుడు లీడ్ లోకి వచ్చేసాడు.   అతడితో సినిమాలు తీయడానికి  నిర్మాతలు, హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో   పారితోషికం పెంచేశాడట. తాజాగా చేసిన ఎఫ్ 2  చిత్రానికి మూడున్నర కోట్లు అందుకున్నఅనిల్ ఇకపై ఒకో చిత్రానికి రూ. 5కోట్లు తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. 

అయితే ఇక్కడే నిర్మాతలు ట్విస్ట్ ఇచ్చారట. నువ్వు అనుకున్న రెమ్యునేషన్ కావాలంటే చిన్న హీరోలతో సినిమా చేసుకో...పెద్ద హీరోలు కావాలంటే మాత్రం డిస్కౌంట్ ఇచ్చుకో అని డైరక్ట్ గా డైరక్టర్ గారికి బేరాలు పెడుతున్నారుట. దాంతో బాలకృష్ణ, మహేశ్ బాబు‌తో సినిమాలు తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్న అనీల్..కాస్తంత డైలమోలో పడ్డారట. . మరి రాబోయే చిత్రాలతో అనిల్ ఏ హీరోతో చేస్తాడో  చూడాలి.