Asianet News TeluguAsianet News Telugu

విశాల్‌కు హైకోర్టులో చుక్కెదురు

నటుడు విశాల్ దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికల్లో విజయం సాధించిన రెండో పదవుల్లో కొనసాగుతున్నారు.

producers council problems for vishal
Author
Hyderabad, First Published May 11, 2019, 10:16 AM IST

నటుడు విశాల్ దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శిగా, నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికల్లో విజయం సాధించిన రెండో పదవుల్లో కొనసాగుతున్నారు. అయితే వీటిలో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిర్మాతల మండలిలో అవకతవకలు జరుగుతున్నాయంటూ వ్యతిరేక వర్గం ఆరోపణలు 
గుప్పిస్తున్నారు.

ఈ క్రమంలో మండలి వ్యతిరేక వర్గం ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం నిర్మాతల మండలి బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకుంది. దీనికోసం ఎన్.శేఖర్ అనే రిజిస్ట్రార్ ని స్పెషల్ ఆఫీసర్ గా నియమించింది. ఈ విషయం నచ్చని విశాల్ వర్గం.. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే ప్రభుత్వం విశాల్ వర్గానికి మరో షాక్ ఇచ్చింది.

మండలి ప్రత్యేక అధికారిగా నియమించిన ఎన్.శేఖర్ కు సహాయ, సహకారాలను అందించే విధంగా తాత్కాలిక అడహాక్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో విశాల్ వ్యతిరేక వర్గానికి చెందిన వ్యక్తులు భారతీరాజా, కే.రాజన్, టీజే.త్యాగరాజన్ లతో కలిపి తొమ్మిది మందిని సభ్యులుగా నియమించింది. దీన్ని వ్యతిరేకించిన విశాల్ మళ్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే హైకోర్టు విశాల్ కి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.

శుక్రవారం నాడు ఈ పిటిషన్ ని విచారించిన న్యాయస్థానం అడహాక్ కమిటీని రద్దు చేయడం కుదరదని చెప్పింది. అయితే అడహాక్ కమిటీ సభ్యులు వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని వెల్లడించింది. ఈ తీర్పు విశాల్ వర్గానికి సంతృప్తినివ్వలేకపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios