ఒక సినిమా ఎక్కడికో తీసుకెల్తే ...ఆ వెంటనే వచ్చిన మరో సినిమా పాతాళానికి లాక్కెళ్ళిపోయింది. అదీ ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ పరిస్దితి. Rx100 సినిమా సూపర్ హిట్ తో వరస సినిమాలు సైన్ చేసిన కార్తికేయ ఆ సక్సెస్ ని నిలుపుకోలేకపోయాడు. తన రెండో సినిమా హిప్పీ తో పెద్ద డిజాస్టర్ ని చవిచూశాడు. ఆ ఇంఫాక్ట్ ఖచ్చితంగా తదుపరి వచ్చే సినిమాలపైనే కాకుండా కెరీర్ పైన కూడా కనపడుతోంది.

కార్తికేయ తాజా చిత్రం  గుణ 369 ప్రీ రిలీజ్ బిజినెస్ వేడి తగ్గిందని వినిపిస్తోంది. మరో ప్రక్క అతను కమిటైన   90 ML అనే సినిమా నుంచి ప్రొడ్యూసర్ మధ్యలో వెళ్లిపోయాడని సమాచారం.  హిప్పీ ఫ్లాఫ్ అయినా ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా వర్కవుట్ అయ్యి తన కెరీర్ కు  బాగా ఉపయోగపడతాయి అనే ధీమా తో ఉన్నాడు కార్తికేయ.  

గుణ 369 ఏ సమస్యలు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది కానీ 90 ML కు ఆది లోనే సమస్యలు వచ్చినట్లు చెప్తున్నారు. ఈ సినిమా ని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై సాహసం శ్వాసగా సాగిపో, జయ జానకి నాయక వంటి సినిమాలు రూపొందించిన మిర్యాల రవీందర్ రెడ్డి  ఈ సినిమా ని మధ్యలో నే వదిలేసినట్లు తెలుస్తుంది.

మొదట అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది అని, హిప్పీ రిజల్ట్ చూసాక మనస్సు మార్చుకున్నాడని తెలుస్తోంది. దాంతో    ఇక తను డబ్బులు పెట్టలేకపోతున్నాను అని చెప్పి, తన షేర్ ఇంతనీ చెప్పి, హీరో చేతిలో ఆ సినిమా పెట్టి  తప్పుకున్నట్లు సమచాారం. దాంతో కార్తికేయ సోదరుడు సినిమా నిర్మాణాన్ని టేక్ ఓవర్ చేసుకున్నాడు అని వినికిడి.