హీరోయిన్‌గా తిరుగులేని స్టార్ ఇమేజ్‌ అందుకున్న అందాల భామ శ్రియ. దాదాపు టాలీవుడ్ సీనియర్ హీరోదంరితోనూ జోడి కట్టిన ఈ బ్యూటీ ఇటీవల సినిమాలను తగ్గించేసింది. తెలుగులో బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తరువాత మరో సినిమాలో కనిపించలేదు. కొత్త హీరోయిన్ల హవాతో శ్రియకు అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో శ్రియ పెళ్లిచేసుకొని పర్సనల్‌ లైఫ్‌లో సెటిల్‌ కావటంతో సినిమాలు పెద్దగా అంగీకరించటం లేదు.

2018 మార్చిలో టెన్నిస్‌ క్రీడా కారుడు, బిజినెస్‌ మేన్‌ ఆండ్రీ కొస్చీవ్‌ను పెళ్లి చేసుకుంది శ్రియ. అప్పటి నుంచి ఈ భామ విదేశాల్లోనే ఉంటుంది. షూటింగ్‌లు ఉంటేనే ఇండియాకు వచ్చి వెళుతోంది. లాక్‌ డౌన్‌ సమయంలో ఈ జంట బార్సిలోనాలో  చిక్కుకుపోయారు, ఈ సందర్భంగా ఈ భామ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక దశలో తన భర్త ఆండ్రీకి కరోనా వచ్చిందన్న భయంకూడా అయినట్టుగా తెలిపారు. బార్సిలోనా కరోనా తీవ్రత భారీ స్థాయిలో ఉండటంతో తిరిగి భారత్‌ను చూస్తానో లేదో అన్న ఆవేదన వ్యక్తం చేసింది శ్రియ.

అయితే తాజాగా శ్రియకు సంబంధించి ఓ పాత ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌ నిర్మాత తనూజ్‌ గార్గ్‌తో శ్రియ దిగిన ఫోటో హాట్ టాపిక్‌గా మారింది. తనూజ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో శ్రియతో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోతో పాటు `అప్పట్లో తాగిన మత్తులో ఉన్న రాత్రులు.. మంచి జ్ఞాపకాలు` అంటూ కామెంట్ చేశాడు. లండన్‌లో దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోపై నెటిజెన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోను శ్రియ భర్త చూస్తే ఎలా ఫీలవుతాడో అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.