సినిమా టికెట్ రేట్లపై నిర్మాత సురేష్‌బాబు సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. వీకెండ్ డేస్‌లో టికెట్ రేట్లు పెంచుకునేలా, వీక్ డేస్‌లో తగ్గించే పద్ధతిని తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలన్నారు.
సినిమా టికెట్ రేట్లపై నిర్మాత సురేష్‌బాబు సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. వీకెండ్ డేస్‌లో టికెట్ రేట్లు పెంచుకునేలా, వీక్ డేస్‌లో తగ్గించే పద్ధతిని తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలన్నారు. వారాంతలో ఒకలా, జనరల్ డేస్‌లో మరో రేట్లు పెట్టాలని, సందర్భానుసారంగా పెంచుకునే తగ్గించుకునే వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందన్నారు. వీకెండ్ లో సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆ రోజుల్లో టికెట్ రేట్లు పెంచుకునేలా, సోమవారం నుంచి డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఆ రోజుల్లో టికెట్ రేట్లు తక్కువగా ఉంటే ఆడియెన్స్ కి కంఫర్ట్ గా ఉంటుందన్నారు.
దీంతో వీకెండ్ లో చూడలేని వారు జనరల్ డేస్‌లో సినిమాలు చూస్తారని, అది పెద్ద సినిమాలకే కాదు, చిన్న సినిమాలకు కూడా కలిసొస్తుందన్నారు. మల్టీప్లెక్స్ ల్లో శుక్ర, శని, ఆదివారాల్లో టికెట్ రేట్లు రూ.250 ఉంటే, సోమవారం నుంచి గురువారం వరకు రూ.150 లకే అమ్మేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ వెసులుబాటుని థియేటర్లకి కల్పించాలన్నారు నిర్మాత సురేష్‌బాబు. టికెట్ రేట్ల ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలని ఆయన తెలిపారు. ఇది ఇప్పటికే బెంగుళూరుతోపాటు ఓవర్సీస్‌లో ఈ సిస్టమ్ ఉందని, దాన్ని మన వద్ద కూడా అమలు చేయాలని ఆయన వెల్లడించారు. నిర్మాతలు, ప్రభుత్వం, థియేటర్ ఓనర్ల ముందు ఆయన ఈ సరికొత్త ప్రతిపాదన పెట్టారు సురేష్‌బాబు.
ఈ సందర్భంగా ప్రస్తుతం ఆడియెన్స్ సినిమాల చూస్తున్న తీరుపై ఆయన స్పందించారు. ఇటీవల కాలంలో థియేటర్ ఫుట్ ఫాల్(ఆక్యుపెన్సీ) పెరిగిందనే వాదన తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అందులో నిజం లేదని, కేవలం భ్రమ మాత్రమే అని తెలిపారు. పెద్ద సినిమాలకు, బాగున్న సినిమాలకు జనం ఎక్కువగా వస్తారని, కానీ ఫ్లాప్ సినిమాలకు అసలు జనం రావడం లేదన్నారు. తాను రెగ్యూలర్‌గా ఫుల్ ఫాల్‌ని గమనిస్తున్నట్టు చెప్పిన ఆయన, ఎక్కడా ఆక్యుపెన్సీ శాతం పెరిగినట్టు గమనించలేదని తెలిపారు.
దీంతోపాటు చిన్నా సినిమా,పెద్ద సినిమా అనే తేడా లేదని, బాగున్న సినిమాలను జనం ఆదరిస్తున్నారని, చూస్తున్నారని, బాగలేని సినిమా ఎంత పెద్దదైనా చూడటం లేదన్నారు. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాల ఫలితాలే అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అయితే పెద్ద స్టార్లున్న సినిమాలకు ఆడియెన్స్ ఎక్కువగా వస్తారని అనుకుంటారని, కానీ అన్ని సందర్భాల్లో అది వాస్తవం కాదన్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ సినిమాలను ఉదహరించారు. ఇప్పుడు `జైలర్` సినిమాని అంతా ఆదరిస్తున్నారు. బాగా కలెక్షన్లు వస్తున్నాయి, కానీ ఆయన గత చిత్రాలు ఆడలేదని తెలిపారు. బాగుంటే చిన్న సినిమాలనైనా చూస్తున్నారని, `విరూపాక్ష`, `బేబీ` చిత్రాలే అందుకు నిదర్శమన్నారు నిర్మాత సురేష్. ఆయన.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద నిర్మాత మాత్రమే కాదు, పెద్ద ఎగ్జిబిటర్లు. `ఆ నలుగురు`గా చెప్పుకునే వారిలో ఒకరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వారికి చాలా థియేటర్లున్నాయి.
