Asianet News TeluguAsianet News Telugu

త్రివిక్రమ్‌, రామ్‌ కాంబినేషన్‌లో సినిమా.. స్రవంతి రవికిశోర్‌ ప్లాన్‌.. `బలగం` స్ఫూర్తితో మూవీ..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. అవును.. కాంబోతో సినిమాకి ప్లాన్‌ జరుగుతుంది. 

producer sravanthi ravi kishore react on trivikram ram movie arj
Author
First Published Nov 7, 2023, 7:42 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌.. కెరీర్‌ ప్రారంభంలో రామ్‌ పెదనాన్న స్రవంతి రవికిశోర్‌ తన బ్యానర్‌లో సినిమాలు చేశారు. దర్శకుడిగా ఎదిగారు. ఇప్పుడు స్టార్‌ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. మరోవైపు రామ్‌ హీరోగా సక్సెస్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. గత రెండు చిత్రాలు డిజప్పాయింట్‌ చేశాయి. `ఇస్మార్ట్ శంకర్‌` తర్వాత హిట్‌ లేదు. దీంతో మరోసారి `డబుల్‌ ఇస్మార్ట్` చేస్తున్నాడు. మాస్‌ హిట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో, రామ్‌ హీరోగా సినిమా చేస్తే ఎలా ఉంటుంది?

ఇదే ఆలోచనతో ఉన్నారు నిర్మాత స్రవంతి రవికిశోర్‌. ఆయన తన బ్యానర్‌ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో మూవీ చేయాలనేది తన డ్రీమ్‌ అని తెలిపారు. అందుకోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్‌ పెద్ద హీరోలతో కమిట్‌మెంట్స్ ఉన్నాయి, అవి పూర్తయ్యాక ఆయన వెసులుబాటుని బట్టి రామ్‌తో సినిమా సెట్‌ చేయాలనుకుంటున్నారు. తాజాగా ఆయన నిర్మించిన చిన్న మూవీ `దీపావళి`(Kida) చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో మాట్లాడారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా సినిమా చేయాలని ఉందని ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. 

కథ నచ్చి చిన్న సినిమా అయినా నిర్మించేందుకు ముందుకొచ్చారు రవికిశోర్‌. పల్లేవాతావరణంలో, భావోద్వేగాల సమాహారంగా సాగేలా `దీపావళి` మూవీ ఉంటుందని, ఆ కంటెంట్‌ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చినట్టు తెలిపారు. అయితే ఇటీవల `బలగం` మూవీ సైలెంట్‌గా వచ్చి పెద్ద హిట్‌ అయ్యింది, అదే కోవలో ఈ చిత్రం కూడా ఆదరణపొందుతుందన్నారు. ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ ప్రదర్శించి స్టాండింగ్‌ ఓవియేషన్‌ దక్కిందని తెలిపారు. పెద్ద స్టార్‌ కాస్ట్ లేకపోయినా, కథే ఆడియెన్స్ ని థియేటర్ కి తప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. దీపావళి పండుగ కానుకగా ఈ నెల 11న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు.

ఇక తన బ్యానర్‌లో సినిమాలు చేయకపోవడంపై స్పందిస్తూ, ఒకప్పుడు బౌండెడ్‌ స్క్రిప్ట్ తో సినిమాలు చేసేవాళ్లం, షూటింగ్‌లోనూ ఇన్‌వాల్వ్ అయ్యేవాళ్లం, దగ్గరుండి సినిమా చేసేవాళ్లమని, కానీ ఇప్పుడు కల్చర్‌ మారిపోయింది, స్క్రిప్ట్ లేకపోయినా సినిమాలు చేస్తున్నారని తెలిపారు. ఇది మంచి పద్ధతి కాదని ఆయన చెప్పారు. అదే సమయంలో సినిమాల్లోకి కార్పోరేట్‌ కల్చర్‌ వచ్చిందని, ఇది కొంత వరకు మంచిదే అని, సినిమాలను ఎక్కువగా చేస్తున్నారని తెలిపారు. అయితే తాను మాత్రం అలా చేయలేనని, అందుకే మూవీస్‌ చేయడం లేదని తెలిపారు. తన బ్యానర్‌లో సినిమాలు చేస్తే కచ్చితంగా రామ్‌తోనే చేస్తామని, లేదంటే ఆలోచిస్తామని, అంత బాగా కథ ఉంటేనే చేస్తామని తెలిపారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios