చిత్ర పరిశ్రమలో విషాదాలు కొనసాగుతున్నాయి. పరిశ్రమకు చెందిన మరో ప్రముఖుడు తుదిశ్వాస విడిచారు. కోలీవుడ్ నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించిన ఎస్ కే కృష్ణకాంత్ అకాల మరణం పొందారు. 52ఏళ్ల కృష్ణకాంత్ గుండెపోటుతో మరణించడం జరిగింది. బుధవారం కృష్ణకాంత్ సడన్ గా గుండెపోటుకు గురయ్యారు. ఛాతిలో నొప్పితో ఆయన బాధపడుతుండగా, కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. 

కృష్ణకాంత్ ని పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించారు. దీనితో ఒక్కసారిగా ఆయన కుటుంబం కుప్పకూలిపోయింది. కృష్ణకాంత్ కు భార్య మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఓ ప్రొడక్షన్ హౌస్ లో మేనేజర్ గా ఉన్న కృష్ణ కాంత్ తిరుడా తిరిడి చిత్రంతో నిర్మాతగా మారారు. హీరో శింబుతో కృష్ణకాంత్ కి మంచి అనుబంధం ఉంది. ఆయనతో మన్మథుడు,కింగ్, పుదుకోట్టైలిరిందు శరవణన్, చొల్లి అడిప్పేన్, మచ్చి వంటి చిత్రాలు తెరకెక్కించారు. 

కృష్ణకాంత్ మరణ వార్త తెలుగుకున్న కోలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది. చిత్ర ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాంపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా హీరో శింబు ఆయన తండ్రి టి రాజేందర్ విషాదంలో మునిగిపోయారు. బాలు ఈ లోకాన్ని విడిచి వారం గడుస్తుండగా, పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది.