టాలీవుడ్ లో హీరోయిన్ అవుదామని వచ్చిన బ్యూటీని ఇప్పుడు బడా ప్రొడ్యూసర్ రికమెండ్ చేస్తున్నట్లు సమాచారం. నటిగా తన టాలెంట్ ని ఇప్పటివరకు నిరూపించలేకపోయింది. కానీ తన లుక్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మంచి కలర్ తన పొడుగు కాళ్లతో గ్లామరస్ గా కనిపించడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇప్పుడు ఈ బ్యూటీకి నిర్మాత సపోర్ట్ కూడా తోడైంది.

టాలీవుడ్ లో బడా నిర్మాతగా పేరు గాంచిన ఈ ప్రొడ్యూసర్ తన కొడుకుని హీరోగా పెట్టి భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటాడు. తన కొడుకు పక్కన స్టార్ హీరోయిన్లను ఎంపిక చేస్తూ హాట్ టాపిక్ అయ్యాడు. తన కొడుకు సినిమాల్లో కూడా ఈ యంగ్ హీరోయిన్ ని సపోర్ట్ చేస్తూ హీరోయిన్ రోల్ ఇచ్చాడు. ఇప్పుడు మిగిలిన నిర్మాతలకు కూడా సినిమాలో హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మను తీసుకోవాలని రికమెండ్ చేస్తున్నాడట.

అంతేకాదు కొందరు నిర్మాతలపై ఆమెకు అవకాశాలు ఇవ్వాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడని సమాచారం. అయితే ఈ సీనియర్ ప్రొడ్యూసర్ తో ఆమెకు ఎలాంటి సంబంధాలు లేవు. అయినప్పటికీ ఆయన అంతగా రికమెండ్ చేస్తుండడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.