వైఎస్ఆర్సీపీలో చేరనున్న ప్రముఖ సినీనిర్మాత పీవీపీ గతంలో టీడీపీ నుంచి విజయవాడలో పోటీకి యత్నించిన పీవీపీ టికెట్ దక్కకపోవడంతో కొంత కాలంగా రాజకీయాలకు దూరం వైఎస్ఆర్సీపీలో త్వరలో చేరనున్న పీవీపీ 

 ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి కూడా వ‌ల‌స‌ల జోరు కోన‌సాగుతున్నద?

 ఇప్ప‌టికే కొంత‌మంది ద్వితీయ శ్రుణి నేతలు జగన్ నాయకత్వంలోని వైకాపాలో చేరాు. ఇప్పుడు ఒక తెలుగు నిర్మాత వైసీపీ లో చేరేందుకు సిద్ద‌మ‌య్యారని సమాచారం

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త,తెలుగు నిర్మాత పొట్లూరి వ‌రప్ర‌సాద్ ‌ వైసీపీ వైపు అడుగులేస్తున్నారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. 2014 ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డానికి ఉబలాటపడ్డారు.

ఆయనకు టికెట్ దొరకలేదు. కేశినేని నానికి చంద్ర‌బాబు టిక్కెట్ ఇచ్చారు. గెలిపించుకున్నారు.

ఇక ఆ సీటును టిడిపి నుంచి ఆశించడం కష్టం. ఎందుకంటే కేశినేని నాని ఇపుడు సిటింగ్ ఎంపి. అందువల్ల రాజకీయాల విలువ తెలుసుకున్న వర ప్రసాద్ ఈ సారి కూడా లోకసభ పోటీచేయాలని నిర్ణయించుకున్నారని, అందువల్ల వైసీపీ మార్గం ఎంచుమార్గం ఎంచుకున్నారని తెలిసిన వాళ్లు చెబుతున్నారు.

లోటస్ పాండ్ వర్గాల మాచారం ప్రకారం వైసీపీ చేరేందుకు అధినేత జ‌గ‌న్మోహన్ రెడ్డి కూడ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారట.

ధన బలం, జనబలం ఉన్న నాయకుడు కృ ష్ణా జిల్లా నుంచి వైసిపి వైపు రావడం ఇపుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. అందువల్ల ఎదురొచ్చిన పెద్ద చేపను అమాంతం పట్టేసేందుకు జగన్ సిధ్దమయ్యారని, తొందర్లోనే ఒక గ్రాండ్ సెరిమనీ లో వరప్రసాద్ వైసిపి కండువా స్వీకరిస్తారని చెబుతున్నారు ఆ పార్టీ వాళ్లు.