కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ పై నిర్మాత ఎమ్ ఎన్ కుమార్ ఆరోపణలు చేశారు. రెమ్యునరేషన్ తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదని మండిపడ్డారు.  

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కి తెలుగులో కూడా ఫేమ్ ఉంది. ఆయన ఈగ, బాహుబలి, సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో నటించారు. ఇటీవల విక్రాంత్ రోనా చిత్రంతో తెలుగులో హిట్ కొట్టాడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ విక్రాంత్ రానా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. వాటిలో కబ్జ 2 ఒకటి. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ కీలక రోల్ చేస్తున్నారు. 

కాగా నిర్మాత ఎమ్ ఎన్ కుమార్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్న కిచ్చా సుదీప్ సినిమా చేయడం లేదట. ఈ మేరకు ఆయనపై ఎమ్ ఎన్ కుమార్ ఆరోపణలు గుప్పించారు. 8 ఏళ్ల క్రితమే సుదీప్ సినిమా చేస్తానంటూ అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆయనకు రూ. 9 కోట్లు చెల్లించాను. అలాగే మరో రూ. 10 లక్షలు కూడా తీసుకున్నారు. డబ్బులు తీసుకుని సుదీప్ డేట్స్ ఇవ్వడం లేదని ఆయన మీడియా ముందు వాపోయారు. 

కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు చేసిన ఎమ్ ఎన్ కుమార్ తనకు న్యాయం జరిగేలా చూడాలంటున్నాడు. దర్శకుడు నంద కిషోర్ కి అడ్వాన్స్ ఇచ్చిన ఎమ్ ఎన్ కుమార్ వీరి కాంబోలో మూవీ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి ముత్తట్టి సత్యరాజ్ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. కాగా ఎమ్ ఎన్ కుమార్ ఆరోపణలపై కిచ్చా సుదీప్ స్పందించాల్సి ఉంది.