చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. తరచుగా విషాద వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా శాండల్ వుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత కెసిఎన్ మోహన్ (62) నేడు మరణించారు.
చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. తరచుగా విషాద వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా శాండల్ వుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాత కెసిఎన్ మోహన్ (62) నేడు మరణించారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధించిన సమస్యలతో కెసిఎన్ మోహన్ బాధపడుతున్నారు.
కేసీఎన్ మోహన్ కన్నడలో అనేక హిట్ చిత్రాలని నిర్మించారు. జయసింహ, భలే చతుర, పోలీస్ పవర్, అలిమయ్య లాంటి చిత్రాలని ఆయన నిర్మించారు. కెసిఎన్ మోహన్ తన తండ్రి స్థాపించిన అనుపమ్ మూవీస్ సంస్థ అధినేతగా కొనసాగారు. వారసత్వాన్ని కొనసాగించారు.
మోహన్ కుటుంబం వరుస విషాదాలతో సతమతమవుతోంది. కొన్నేళ్ల క్రితం మోహన్ సతీమణి పూర్ణిమ గుండెపోటు కారణంగా మరణించారు. ఆ తర్వాత ఏడాది క్రితం ఆయన సోదరుడు చంద్రశేఖర్ కూడా మృత్యువాత పడ్డారు. ఇప్పుడు మోహన్ మరణంతో వారి కుటుంబం పెను విషాదంలోకి నెట్టివేయబడింది. మోహన్ కి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
కిడ్నీ వ్యాధి కోసం మోహన్ చాలా కాలంగా బెంగుళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే రెండు కిడ్నీలు పాడవడంతో పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు.
మోహన్ మృతితో ఒకవైపు కుటుంబ సభ్యులు తీరని శోకంలో ఉంటే.. మరోవైపు 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఆయన నిర్మాణ సంస్థ భవితవ్యం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.ఆయనకి సొంతంగా థియేటర్స్ కూడా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్ గా కూడా రాణించారు. కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు కెసిఎన్ మృతి కి సంతాపం తెలుపుతున్నారు.
