Asianet News TeluguAsianet News Telugu

శింబుకు కాస్ట్‌లీ కారు గిఫ్ట్‌ ఇచ్చిన నిర్మాత... రేటెంతో తెలిస్తే.. నోరెళ్ల బెట్టాల్సిందే

చాలా కాలం తరువాత మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు తమిళ స్టార్ హీరో శింబు. తమిళ నాటు మంచి ఇమేజ్ ఉన్న ఈ హీరో.. సెకండ్ ఇన్నింగ్స్ లో  దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా శింబుకు ఓ కాస్ట్లీ కార్ గిఫ్ట్ గా వచ్చింది. ఎందుకంటే..? 

Producer Ishan K Ganesh Car  Gifts To Hero Simbu
Author
First Published Sep 25, 2022, 2:04 PM IST

చాలా కాలం తరువాత మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు తమిళ స్టార్ హీరో శింబు. తమిళ నాటు మంచి ఇమేజ్ ఉన్న ఈ హీరో.. సెకండ్ ఇన్నింగ్స్ లో  దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా శింబుకు ఓ కాస్ట్లీ కార్ గిఫ్ట్ గా వచ్చింది. ఎందుకంటే..? 

మానాడు సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు హీరో శింబు. ఈ సినిమాతో  మంచి కంబ్యాక్‌ ఇచ్చాడు శింబు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ మూవీ తమిళనాటు ఘనవిజయం సాధించి శింబుకు  రెండో సారి లైఫ్ ఇచ్చింది. అదే జోష్‌తో శింబు రీసెంట్ గా తమిళంలో మరో సినిమా చేశాడు. వెందు తానింధాతు కాడు టైటిల్ తో తెరకెక్కిన ఈసినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు యంగ్ హీరో. ఇక ఈసినిమా తెలుగులో ది లైఫ్‌ ఆఫ్ ముత్తు పేరుతో రిలీజ్ అయ్యింది. 

 సెప్టెంబర్ 15న రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. మొదట ఈసినిమా సరిగ్గా ఆడలేదు. కాని రాను రాను జనాలకు మూవీ బాగా ఎక్కేయడంతో.. తమిళనాటు మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది.  బాక్సాఫీస్ దగ్గర కూడా ఈసినిమాకు మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది.  గౌతమ్ మీనన్‌ కూడా చాలా కాలం తర్వాత ఈ మూవీతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సాధించాడు. ఒక చిన్న ఊరు నుండి వచ్చిన ముత్తు పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఒపెనింగ్స్ అంతగా రాకపోయినా రోజు రోజుకు ఈ సినిమాపై ఆదరణ పెరుగుతుంది. 

 

ఇక ఇది ఇలా ఉండగా.. రీసెంట్ గా ఈసినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం.. చిత్ర నిర్మాత హీరో శింబుతో పాటు  గౌతమ్‌ మీనన్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్‌లను ఇచ్చాడు.వెందు తానింధాతు కాదు ఘన విజయం సాధించడంతో నిర్మాత ఇషారి.కే గణేష్ హీరోకు, దర్శకుడికి  గిఫ్ట్‌ గా ఇచ్చాడు. హీరో శింబుకు కోటీ రూపాయలు విలువ చేసే టోయోటో న్యూ వెల్‌ఫైర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక దర్శకుడు గౌతమ్‌ మీనన్‌కు కాస్ట్‌లీ బైక్‌ను ఇచ్చాడు. నిర్మాతకు మంచి ప్రాఫిట్స్ రావడంతోనే.. సంతోషంలో ఆయన ఇలా చేసినట్టు తెలుస్తోంది. 

ఈ విషయం ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ విషయంపై తమిళ సోదర నెటిజ్లు గట్టిగానే స్పందిస్తున్నారు. ఇక ఈ  సినిమాలో  శింబుకు జోడీగా సిద్ధి ఇద్నాని హీరోయిన్‌గా నటించింది. ఏ ఆర్‌ రెహమాన్ సంగీతం అందించాడు. ఇక గౌతమ్‌ మీనన్‌ ఓ వైపు దర్శకుడిగా సినిమాలు తెరకెక్కిస్తూనే  మరో వైపు నటుడిగా ప్రతిభ చాటారు. 

Follow Us:
Download App:
  • android
  • ios