ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు రాజకీయాల్లోకి రానున్నారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు రాజకీయాల్లోకి రానున్నారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన పొలిటికల్ ఎంట్రీపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావాలని తనకు ఆఫర్లు ఉన్నాయని చెప్పారు. అయితే వెళ్లలా? వద్దా? అనే దానిపై ఎటువంటి క్లారిటీకి రాలేదని చెప్పారు. సినిమా పరిశ్రమలోనే రాళ్లు వేస్తుంటే, కామెంట్స్ చేస్తుంటే తట్టుకోలేనని అన్నారు. కానీ చేసే వాళ్లు చేస్తూనే ఉంటారని చెప్పారు. రాజకీయాల్లో వెళ్లాలంటే.. హార్ట్‌లొో, మైండ్‌లో ప్రిపేర్ అవ్వాలని అన్నారు. తన వల్ల అది కాకపోవచ్చేమోనని అన్నారు. అందులోనే ప్రశ్న కావాలా? ఆన్సర్ కావాలా? అనేది వెతుక్కోమని మీడియాకు చెప్పారు.

ఇక, తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం ఉన్న ప్రముఖ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. దిల్ రాజుకు పలువురు రాజకీయ నేతలతో కూడా సత్సబంధాలు ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా దిల్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల దిల్ రాజు కుమార్తె హన్షిత, సోదరుడి కుమారుడు హర్షిత్ నిర్మించిన సినిమా 'బలగం' ప్రీ రిలీజ్ ఈవెంట్ సిరిసిల్లలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా వచ్చారు. మరోవైపు తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కించారు. దీంతో అప్పటి నుంచి దిల్ రాజ్ పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం మొదలైంది. 

మరోవైపు ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డితో హాత్‌ సే హత్‌ జోడో యాత్రలో భాగంగా రేవంత్‌ నాలుగు రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించారు. అదే సమయంలో రేవంత్‌ రెడ్డిని దిల్‌ రాజు కలిశారని చెబుతున్నారు. దిల్‌ రాజు స్వగ్రామం నర్సింగ్‌పల్లిలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి రేవంత్‌ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించడమే కాకుండా ఆయనతో కలిసి ప్రత్యేక పూజలు చేయించారు. దీంతో దిల్‌ రాజు.. రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారన్న వార్తలు మరింతగా జోరందుకున్నాయి. 

అయితే దిల్ రాజుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి ఆఫర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దిల్ రాజు యాక్టివ్ ప్రొడ్యూసర్‌గా ఉండటంతో.. ఒక రాజకీయ పార్టీలో చేరితే మిగిలిన పార్టీలతో ఇబ్బంది వస్తుందని, ఎలక్షన్ల తలనొప్పులు పడటం ఎందుకనే ఆలోచనలో దిల్‌రాజు ఉన్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్‌లో చేరితో బీజేపీ నుంచి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది. అందుకే దిల్‌రాజు రాజకీయాలపై దిల్ రాజు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన దిల్ రాజు.. తనకు ఆఫర్లు ఉన్నాయని.. అయితే రాజకీయాలు తన వల్ల కాకపోవచ్చని కామెంట్ చేశారు. అయితే దిల్ రాజు ఆసక్తి మాత్రం రాజ్యసభ సీటుపై ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది.