టాలీవుడ్ లో అగ్ర దర్శకుడిగా చెలామణి అవుతోన్న ఓ దర్శకుడితో సినిమా చేయడానికి ఓ అగ్ర నిర్మాణ సంస్థ అడ్వాన్స్ ఇచ్చింది. సదరు డైరెక్టర్ అడ్వాన్స్ అందుకొని ఎంత కాలమవుతున్నా.. ఇప్పటివరకు సినిమాని పట్టాలెక్కించలేదు. ఇటీవల కూడా ఓ బ్లాక్ బస్టర్ సినిమా చేసి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు.

తన తదుపరి సినిమాని కూడా లైన్ లో పెట్టుకుంటున్నాడు. దానికి ఈ అగ్ర నిర్మాత సంస్థ నిర్మాతలుగా వ్యవహరిస్తారా..? అంటే సందేహమే.. అడ్వాన్స్ తీసుకొని తమ బ్యానర్ లో సినిమా చేయకుండా.. ఇతర బ్యానర్లతో సినిమా చేస్తున్నా.. తమ వంతు కోసం ఎదురుచూశారు నిర్మాతలు.

కానీ ఇప్పటివరకు తమ బ్యానర్ లో సినిమా సంగతి మాట్లాడడం లేదు డైరెక్టర్. దీంతో సహనం కోల్పోయిన నిర్మాతలు తీసుకున్న అడ్వాన్స్ ని వడ్డీతో సహా చెల్లించాలని డైరెక్టర్ కి కబురు పంపించారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన సెటిల్మెంట్ లు జరుగుతున్నాయని వినికిడి.

ఎలాగైనా.. దర్శకుడికి ఇచ్చిన అడ్వాన్స్ మొత్తాన్ని తిరిగి తీసుకోవాలని పట్టుదలతో ఉన్నారట నిర్మాతలు. వారి ప్రవర్తన కారణంగా సదరు డైరెక్టర్ చిరాకు పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి!