అప్పుడు హీరోయిన్ కీర్తి సురేష్ ఇప్పుడు ‘దసరా’ నిర్మాత.. ఏం చేశారంటే?
‘దసరా’ చిత్రం బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుని థియేటర్లలో సందడి చేస్తోంది. దీంతో నిర్మాత చెరుకూరి సుధాకర్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు గిఫ్ట్స్ అందజేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
నేచురల్ స్టార్ నాని - కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’. మార్చి 30న పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటి రోజునే పాజిటివ్ టాక్ ను అందుకుంది. దాంతో థియేటర్లు ఆడియెన్స్ తో నిండిపోయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే చిత్రం రూ.70 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ప్రస్తుతం నార్త్ లో కలెక్షన్లు పెరుగుతున్నాయి.
మొత్తానికి సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలవడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. దీంతో రకరకాలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘మహానటి’తర్వాత హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) నటనకు ఈ చిత్రంతో మంచి పేరు దక్కింది. ఇక సినిమా విడుదలకు ముందే తను వెన్నెల పాత్రను చాలా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది. సినిమాను అంతబాగా తీర్చిదిద్దడంలో భాగమైన చిత్ర యూనిట్ ను కీర్తి అభినందించారు. దాంతో రూ.10 లక్షలు విలువ గల 2 గ్రాముల బంగారు బిళ్లలను 110 మందికి అందజేసింది.
ఇక తాజాగా నిర్మాత చెరుకూరి సుధాకర్ సైతం చిత్ర యూనిట్ కు బహుమతులు అందజేశారు. వారి పనితీరుకు మెచ్చుకొని యూనిట్ లోని ప్రతి ఒక్కరికీ 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ ను అందజేశారంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చెక్కర్లు కొడుతోంది. దసరా సక్సెస్ లో చిత్ర యూనిట్ శ్రమను గుర్తించినందుకు నిర్మాతను పలువురు అభినందిస్తున్నారు. ఇక దసరా చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ బెల్ట్ లోనూ కలెక్షన్ల పరంగా దుమ్ములేపుతోంది. అలాగే ఓవర్సీస్ లోనూ 1.6 మిలియన్ల డాలర్స్ ను దక్కించుకుంది.
ఈచిత్రంలో నాని కేరీర్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ అందించారు. సింగరేని మైన్స్ పరిసరప్రాంతాల్లోని తెలంగాణ పల్లెలో జరిగిన కథను దర్శకుడు చక్కగా చూపించారు. నాని - కీర్తి సురేష్ డీగ్లామర్ రోల్స్ లో ఇరగదీశారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత చెరుకకూరి సుధాకర్ నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.